హరియాణాలోని ఛండీగఢ్‌లో కాంగ్రెస్ నేతల రాజ్‌భవన్ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో వారిని అదుపు చేసేందుకు జలఫిరంగులు ప్రయోగించారు.
రాజ్‌భవన్ ముట్టడి..
నూతన సాగు చట్టాలు, ఇంధన ధరల పెంపుపై పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు రాజ్భవన్ల ముట్టడి కార్యక్రమాల్ని శుక్రవారం నిర్వహించారు. కిసాన్ అధికార్ దివస్ పేరుతో జరుపుతున్న ఈ నిరసనలో బంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి : 'రైతు సత్యాగ్రహంలో భాగస్వాములు అవ్వండి'