శ్రీనగర్ సహా ఇతర ప్రాంతాల్లో చురుకుగా పనిచేస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను పట్టించిన వారికి రివార్డు ఇవ్వనున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ప్రకటించారు. వీరికి సంబంధించిన సమాచారాన్ని తమతో నేరుగా పంచుకోవచ్చని తెలిపారు.
వీరిలో ఆరుగురు 2020లోనే ఉగ్రవాదులుగా మారినట్టు పోలీసులు గుర్తించారు. మిగతా ముగ్గురు గత కొన్నేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు 9మంది పేర్లను విడుదల చేశారు.
![JK Police releases names of 9 wanted militants, announces reward](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10999727_11.jpg)
వసీమ్ ఖాదీర్, ఆదిల్ ముస్తాక్, ఇర్ఫాన్ సోఫీ, సాకిబ్ మన్జూర్, బిలాల్ అహ్మద్ భట్, ఉబేద్ షఫి, మొహమ్మద్ అబ్బాస్ షేక్, మొహమ్మద్ యూసుఫ్ దార్, అబ్రార్ నదీమ్ల సమాచారం ఇచ్చిన వారికి రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పోలీసుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని, వివరాలు తెలిస్తే తమకు ఇవ్వాలని సూచించారు.
ఇదీ చదవండి: ఉగ్రవాదం వైపు కశ్మీరీ యువత- ఆపేదెలా?