ETV Bharat / bharat

'నాకు భార్యవి అవుతావా?'.. ఇన్​స్టాలో స్టేటస్​ పెట్టిన బాలుడికి పోలీసుల బిగ్ షాక్ - ఇన్​స్టాగ్రామ్​లో స్టేటస్​ కారణంగా అరెస్ట్​

ప్రస్తుతం సమాజంలో సోషల్​ మీడియా ప్రభావం పెరిగిపోవడం వల్ల ఎవరు ఏం చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత చిన్నపిల్లలు సైతం మొబైల్​ను ఎక్కువగా వినియోగించడం మొదులుపెట్టారు. వారు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరూ ఊహించలేరు. అయితే మహారాష్ట్రలో ఓ స్కూల్​ విద్యార్థి తన ఇన్​స్టాగ్రామ్​లో పెట్టిన స్టేటస్​ అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలు ఆ స్టేటస్​లో ఏం ఉందంటే!

Police case filed against 14 year old school boy
ఇన్​స్టాగ్రామ్​లో స్టేటస్​
author img

By

Published : Nov 23, 2022, 5:53 PM IST

కరోనా మహమ్మారి రాకతో పిల్లల చదువులన్నీ మొబైల్​కే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం కరోనా తగ్గి పాఠశాలలు ప్రారంభించినా సరే చాలా మంది పిల్లలు మొబైల్​లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అలా వారు సోషల్​ మీడియాకు బానిసై.. ఎప్పుడు ఏం చేస్తారో ఎవరూ ఊహించలేకపోతున్నారు. అయితే పుణెలో ఓ 14 ఏళ్ల పాఠశాల విద్యార్థి.. తన ఇన్​స్టాగ్రామ్​లో పెట్టిన స్టేటస్​.. అతడిపై కేసు నమోదయ్యేలా చేసింది.

అసలు ఏం జరిగిందంటే..?
పుణెలోని హడప్​సర్​ ప్రాంతంలో ఓ 14 ఏళ్ల స్కూల్​ విద్యార్థి .. తన ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో ఓ స్టేటస్​ పెట్టాడు. ఆ స్టేటస్​ చూసి అతడి స్కూల్​ టీచర్​ కూడా షాక్​కు గురయ్యారు. అయితే ఆ విద్యార్థి అదే ప్రాంతానికి చెందిన.. తన స్కూల్​లో చదివే 13 ఏళ్ల బాలికను తనతో స్నేహం చేయాలని వెంటపడేవాడు. లేదంటే తనని ఎత్తుకు పోతానని బెదిరించాడు. అయినా సరే ఆ బాలిక అతడ్ని పట్టించుకోలేదు. దీంతో ఆ బాలికపై కోపం పెంచుకున్నాడు. ఆ బాలికను ఫొటో తీసి.. తన ఇన్​స్టాగ్రామ్​లో 'నువ్వు నా భార్యవి అవుతావా?' అని ఓ స్టేటస్​ పెట్టాడు. దీన్ని చూసిన ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లి హడప్​సర్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.