ETV Bharat / bharat

ప్రభుత్వ బ్యాంకులో 'స్పెషల్' ఉద్యోగాలు.. జీతం రూ.78వేల పైనే! - pnb job hiring

PNB SO recruitment 2022: ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారికి మరో గుడ్​న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఆకర్షణీయ వేతనంతో అభ్యర్థులను నియమించుకోనున్నారు. వాటి వివరాలు మీకోసం...

PNB NOTIFICATION
PNB NOTIFICATION
author img

By

Published : Apr 25, 2022, 4:37 PM IST

PNB SO recruitment 2022: పంజాబ్ నేషనల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్(ఎస్ఓ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 145 ఖాళీలను ఇందులో భర్తీ చేయనుంది. మేనేజర్లు, సీనియర్ మేనేజర్లను నియమించుకోనుంది ఈ బ్యాంకు. ఖాళీల వివరాలు, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

PNB job vacancy 2022
మొత్తం ఖాళీలు- 145
*మేనేజర్ (రిస్క్)- 40
*మేనేజర్ క్రెడిట్- 100
*సీనియర్ మేనేజర్(ట్రెజరీ)- 5

ముఖ్యమైన తేదీలు
*ఆన్​లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం- ఏప్రిల్ 22
*దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ- మే 7
*పరీక్ష నిర్వహించే తేదీ- జూన్ 12
వేతనం ఇలా..
*రిస్క్ మేనేజర్, క్రెడిట్ మేనేజర్- రూ.48,170 నుంచి రూ.69,810 మధ్య
*సీనియర్ మేనేజర్- రూ.63,840 నుంచి రూ.78230 మధ్య
అర్హతలు
ఐసీఏఐ నుంచి ఛార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేసి ఉండాలి. లేదా కాస్ట్ మేనేజ్​మెంట్ అకౌంటెంట్​ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు. లేదా 60 శాతం మార్కులతో ఎంబీఏ, రెండేళ్ల పీజీ(ఫైనాన్స్) పాస్ అయి ఉండాలి. వీటితో పాటు నోటిఫికేషన్​లో పేర్కొన్న మరిన్ని విద్యార్హతలు గమనించాలి. సంబంధిత రంగంలో 1-3 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం కూడా ఉండాలని నోటిఫికేషన్​లో పేర్కొన్నారు.
వయసు (2022 జనవరి 1 నాటికి)
*క్రెడిట్ మేనేజర్, రిస్క్ మేనేజర్- 25-35 ఏళ్ల మధ్య ఉండాలి.
*సీనియర్ మేనేజర్- 25- 37 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ ఇలా..
*అభ్యర్థులకు ఆన్​లైన్ టెస్టు నిర్వహిస్తారు. అందులో సత్తా చాటిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
అప్లై ఎలా?
*ఆసక్తి ఉండి.. అర్హత కలిగిన అభ్యర్థులు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారిక వెబ్​సైట్ అయిన www.pnbindia.in ద్వారా తమ దరఖాస్తు ఫారాన్ని సమర్పించవచ్చు.
ఫీజు
*ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది.
*ఇతర అభ్యర్థులకు రిజిస్ట్రేషన్, పరీక్ష ఫీజు రూ.850

ఇవీ చదవండి:

స్విగ్గీ బంపర్ ఆఫర్.. ఇకపై వారంతా మేనేజర్స్.. ఫుల్​టైమ్ జాబ్, సూపర్ సాలరీ!

డిగ్రీ, బీటెక్​లతో​ అమెజాన్‌లో ఉద్యోగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.