ప్రముఖ పోరాట యోధుడు సుహేల్ దేవ్ జయంతి సందర్భంగా మంగళవారం ఆయన విగ్రహ ఆవిష్కరణకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి మోదీ వర్చువల్‌గా హాజరుకానున్నారు. శ్రావస్తి, చిత్తోరా సరస్సు, బహ్రైచ్ పట్టణాభివృద్ధి గురించి మోదీ ఈ కార్యక్రమంలో మాట్లాడనున్నట్లు ఓ ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
తమిళనాడులో...
బుధవారం 4.30 గంటలకు తమిళనాడులో ఆయిల్&గ్యాస్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు మోదీ. దీంతో పాటు మౌళిక సదుపాయాల రంగం అభివృద్ధికై 2021-22 బడ్జెట్ వినియోగం గురించి చర్చించేందుకు ఓ వెబినార్‌లో పాల్గొననున్నారు.
నాస్కామ్....
బుధవారం.. నాస్కామ్ టెక్నాలజీ లీడర్షిప్ ఫోరమ్(ఎన్టీఎల్ఎఫ్) కార్యక్రమానికీ వర్చువల్‌గా హాజరుకానున్నారు.
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(నాస్కామ్)కు సంబంధించిన 29వ ఎడిషన్ ఎన్టీఎల్ఎఫ్ కార్యక్రమం ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది. 'షేపింగ్ ద ఫ్యూచర్ టువర్డ్స్ ఎ బెటర్ నార్మల్' థీమ్‌తో ఈ ఏడాది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
వర్చువల్ వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో 30 దేశాల నుంచి 1600 మంది పాల్గొననున్నారు.
ఇదీ చదవండి:లోయలో వాహనం పడి ఆరుగురు మృతి