ETV Bharat / bharat

మోదీకి జపాన్​ ప్రధాని ఫోన్​- చైనాపై చర్చ - చైనాపై సుగా వ్యాఖ్యలు

చైనా ఏకపక్ష నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేశారు జపాన్​ ప్రధానమంత్రి సుగా. తూర్పు, దక్షిణ చైనా సముద్రంలో నెలకొని ఉన్న యథాతథ స్థితిని మార్చడానికి ఆ దేశం​ ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్​లో మాట్లాడారు.

PM Suga & PM Modi had fruitful telephone conversation
మోదీకి జపాన్​ ప్రధాని ఫోన్​.. చైనాపై చర్చ
author img

By

Published : Mar 9, 2021, 7:52 PM IST

తూర్పు, దక్షిణ చైనా సముద్రంలో నెలకొని ఉన్న యథాతథ స్థితిని మార్చడానికి చైనా​ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని.. అది ఏ మాత్రం సహించదగింది కాదని అన్నారు జపాన్​ ప్రధానమంత్రి సుగా. చైనా తీసుకువచ్చిన కొత్త కోస్ట్​గార్డ్​ చట్టం, హాంకాంగ్​, షిన్​జియాంగ్, ఉయ్ఘర్​ను వారి అనుబంధ ప్రాంతాలుగా ప్రకటించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్​లో సంభాషించారు.

భారత్​-జపాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల ప్రధానులు చర్చించారు. ​భద్రత, రక్షణ వంటి రంగాల్లో పరస్పర సహకారం కొనసాగించాలని తీర్మానించారు.

పీఎం సుగా, నరేంద్రమోదీ మధ్య జరిగిన చర్చల సఫలమైనట్లు భారత్​లోని జపాన్​ రాయబారి తెలిపారు. ఇండో-పసిఫిక్​ ప్రాంతాభివృద్ధిలో ఇరు దేశాల పాత్రపై మాట్లాడినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బ్రిటన్​ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.