PM Rojgar Mela Today : భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిబాటలో పయనిస్తోందని.. దీని వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆటోమొబైల్, ఫార్మా, పర్యటక రంగాలు.. భవిష్యత్తులో శరవేగంగా అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. దాని వల్ల యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మోదీ పేర్కొన్నారు.
'2030 నాటికి 14కోట్ల ఉద్యోగాలు'
PM Modi Rojgar Mela : దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో సోమవారం జరిగిన రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. కేంద్ర సాయుధ బలగాలకు ఎంపికైన 51వేలకు పైగా ఉద్యోగులకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు. 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు పర్యటక రంగమే రూ.20 లక్షల కోట్లు అందించి దోహదపడుతుందని.. 14 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని మోదీ తెలిపారు.
-
#WATCH | Walking on the paths of vocal for local mantra, the govt is focusing on the purchase of Made-in-India laptops, and computers. This has increased manufacturing and created new job opportunities too: PM Modi pic.twitter.com/9OcwFSfeq6
— ANI (@ANI) August 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Walking on the paths of vocal for local mantra, the govt is focusing on the purchase of Made-in-India laptops, and computers. This has increased manufacturing and created new job opportunities too: PM Modi pic.twitter.com/9OcwFSfeq6
— ANI (@ANI) August 28, 2023#WATCH | Walking on the paths of vocal for local mantra, the govt is focusing on the purchase of Made-in-India laptops, and computers. This has increased manufacturing and created new job opportunities too: PM Modi pic.twitter.com/9OcwFSfeq6
— ANI (@ANI) August 28, 2023
"ఈ దశాబ్దంలో ప్రపంచంలోని మూడు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఆవిర్భవించి సామాన్యులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు సిద్ధమైంది. దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. నేను పూర్తి బాధ్యతతో పనిచేస్తాను. దేశంలో ప్రతి రంగం అభివృద్ధి చెందాలి. ఆహారం నుంచి ఫార్మా వరకు.. అంతరిక్షం నుంచి స్టార్టప్‌ల వరకు.. ప్రతి రంగం పురోగమిస్తేనే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
'ఫార్మా పరిశ్రమలకు యువత ఎంతో అవసరం'
PM Modi Speech Today : ప్రస్తుతం రూ.4 లక్షల కోట్ల విలువ ఉన్న ఫార్మాస్యూటికల్ రంగం.. 2030 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరునుందని అంచనా వేస్తున్నట్లు మోదీ చెప్పారు. ఆ సమయంలో ఫార్మా పరిశ్రమలకు యువత ఎంతో అవసరమని.. పెద్ద ఎత్తున ఉపాధివకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆటోమొబైల్ రంగం కూడా వృద్ధి బాటలో పయనిస్తోందని, దానిని ముందుకు తీసుకెళ్లేందుకు యువశక్తి అవసరమని మోదీ వివరించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో చట్టబద్ధమైన పాలన ఉండడం వల్ల అక్కడ పెట్టుబడులు పెరుగుతున్నాయని మోదీ తెలిపారు. తద్వారా యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పారు. మరికొన్ని రాష్ట్రాల్లో నేరాల శాతం ఎక్కువగా ఉండడం వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని మోదీ పేర్కొన్నారు.
Modi Greece Visit : '9 ఏళ్లలో భూమి-చంద్రుడి మధ్య దూరమంత రోడ్లు వేశాం'.. ప్రవాస భారతీయులతో మోదీ
Modi Mann Ki Baat : 'మహిళాశక్తికి 'చంద్రయాన్-3' విజయం ప్రత్యక్ష ఉదాహరణ'