సాంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నియోజక వర్గం వారణాసిలోని బియార్పూర్, పర్హంపూర్ అనే రెండు గ్రామాలను దత్తత తీసుకోకున్నారు. ఈ మేరకు అధికారిక వర్గాలు సోమవారం వెల్లడించాయి. గతంలో ఇదే తరహాలో నాలుగు గ్రామాలను(జయపుర్, నాగ్‌పుర్, కాక్రాహియా, డోమరి) స్వీకరించిన మోదీ.. వాటిని అభివృద్ధి చేశారు.
కరోనా సంక్షోభం కారణంగా గతేడాది ఆదర్శ గ్రామాలను ఎంపిక చేయలేదు. ఈ సంవత్సరం ఒకేసారి రెండు గ్రామాల బాధ్యతల్ని మోదీ చూసుకోనున్నట్టు సమాచారం. ఈ విషయమై ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. త్వరలోనే సంబంధిత జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపనున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఎడతెగని ఎదురుచూపులు- ఆవిరవుతున్న ఆశలు