PM Modi UP campaign: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పార్టీలు ఇంకా పాత రాజకీయాల్లోనే ఇరుక్కున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మాఫియాతో సంబంధాలు పెట్టుకొని పనిచేస్తున్నాయని ఆరోపించారు. విపక్షాలను రాజవంశాలుగా అభివర్ణించారు. రాష్ట్రంలోని చందౌలీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే.. భాజపా మాత్రం 'సబ్కా సాత్ సబ్కా వికాస్' సూత్రంతో పనిచేసిందని అన్నారు.
భాజపా ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాలేదని మోదీ అన్నారు. పథకాలన్నీ లబ్ధిదారులకు చేరుకునేలా పనిచేసిందని చెప్పారు. భాజపా కూటమి చందౌలీ ప్రజల పక్షానే ఉందని అన్నారు.
ఇదీ చదవండి: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. క్వాడ్ నేతలతో మోదీ కీలక భేటీ