ETV Bharat / bharat

'స్టాట్యూ ఆఫ్​ పీస్​' విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ - నరేంద్ర మోదీ న్యూస్

జైన్​ ఆచార్య శ్రీ విజయ వల్లభ సురేశ్వర్​ మహారాజ్​ 151వ జయంతి సందర్భంగా 'స్టాట్యూ ఆఫ్​ పీస్​' విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Prime Minister Narendra Modi unveils the ‘Statue of Peace’ in Pali, Rajasthan
'స్టాట్యూ ఆఫ్​ పీస్​' విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
author img

By

Published : Nov 16, 2020, 1:38 PM IST

Updated : Nov 16, 2020, 2:23 PM IST

రాజస్థాన్​ పాళీ జిల్లాలోని విజయ వల్లభ సాధన కేద్రంలో 'స్టాట్యూ ఆఫ్​ పీస్​' విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

"గుజరాత్ నేల ఇద్దరు వల్లభులను ఇచ్చిందని విజయ విజయ నిత్యానంద్ సురేశ్వర్ మహారాజ్​ చెప్పేవారు. ఒకరు రాజకీయ రంగానికి చెందిన సర్ధార్ వల్లభ్​భాయ్ పటేల్​ కాగా.. ఆధ్యాత్మిక రంగానికి చెందిన విజయ వల్లభ్​​ మహారాజ్ మరొకరు. ఇద్దరూ దేశ ఐక్యత, సౌభ్రాతృత్వం కోసం జీవితాల్ని అంకితం చేశారు. సర్దార్ పటేల్ 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ', జైనాచార్య విజయ వల్లభ్ 'స్టాట్యూ ఆఫ్ పీస్' విగ్రహాలను ఆవిష్కరించే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. మానవత్వం, శాంతి, అహింస, సౌభ్రాతృత్వానికి భారత దేశం ఉదాహరణగా నిలుస్తోంది. యావత్​ ప్రపంచం మనవైపు చూస్తోంది."

-ప్రధాని మోదీ.

జైన్​ ఆచార్య శ్రీ విజయ వల్లభ సురేశ్వర్​ మహారాజ్​ 151వ జయంతి సందర్భంగా 151 అంగుళాల ఎత్తైన విగ్రహాన్ని రూపొందించారు. అష్టధాతు లోహాలతో విగ్రహాన్ని తయారుచేశారు. శ్రీ విజయ వల్లభ సురేశ్వర్​ మహారాజ్ ఒక జైన్​ ఆచార్యులు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారు. ఎన్నో పాటలు, శ్లోకాలు రాశారు. స్వాతంత్య్రోద్యమంలోనూ పాల్గొన్నారు.

Last Updated : Nov 16, 2020, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.