జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా హాజరు కానున్నారని విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఈ సదస్సులో భాగంగా సభ్య దేశాలు మహమ్మారి కట్టడి, ఆరోగ్యం, వాతావరణ మార్పులపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. 'బిల్డ్ బ్యాక్ బెటర్' అనే ఇతివృత్తంతో సదస్సు జరగనుందని వెల్లడించారు.
బ్రిటన్‌లో జరగనున్న ఈ సదస్సుకు ప్రధానికి ఆహ్వానం అందినా.. కరోనా కారణంగా ఈ కార్యక్రమానికి వర్చువల్‌గానే హాజరవుతారని విదేశాంగ శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. జీ7 సదస్సుకు హాజరు కావడం ప్రధానికి ఇది రెండోసారి. అంతకుముందు ఫ్రాన్స్ ఆహ్వానం మేరకు 2019లో జరిగిన సదస్సులో పాల్గొన్నారు.
ఇదీ చదవండి : జీ-7కు ఆహ్వానం- భారత్‌కు సదవకాశం