ETV Bharat / bharat

నేడు కేరళలో పలు ప్రాజెక్టులు ప్రారంభించనున్న మోదీ

కేరళలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వర్చువల్​గా హాజరై.. పలు ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. అలాగే.. బంగాల్​లోని విశ్వభారతి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు.

PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
author img

By

Published : Feb 19, 2021, 5:06 AM IST

అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో శుక్రవారం విద్యుత్తు, పట్టణ విభాగాల్లోని పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా హాజరుకానున్నారు.

తమిళనాడులోని పుగలుర్​ నుంచి కేరళలోని త్రిస్సూర్​ వరకు 320 కేవీ విద్యుత్తు ట్రాన్స్​మిషన్​ ప్రాజెక్టును మోదీ ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. రూ.5,070 కోట్ల వ్యయంతో దేశంలోనే తొలిసారి వీఎస్​సీ సాంకేతికతో నిర్మించిన హెచ్​వీడీసీ ప్రాజెక్టుగా పేర్కొంది. దీని ద్వారా 2000 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేయనున్నారు. అలాగే.. 50 మెగావాట్ల కాసరగడ్​ సౌర విద్యుత్తు కేంద్రాన్ని జాతికి అంకితమివ్వనున్నారని పీఎంఓ తెలిపింది. వాటితో పాటు.. తిరువనంతపురంలో ఇంటిగ్రేటెడ్​ కమాండ్​ కంట్రోల్​ సెంటర్​, స్మార్ట్​ రోడ్స్​ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

విశ్వభారతి స్నాతకోత్సవానికి హాజరు..

బంగాల్​లోని విశ్వ భారతి విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహిస్తోన్న స్నాతకోత్సవానికి వర్చువల్​గా హాజరుకానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బంగాల్​లోని బిర్భమ్​ జిల్లాలో ఉన్న ఈ విశ్యవిద్యాలయంలో ఛాన్సలర్​గా వ్యవహరిస్తున్నారు ప్రధాని. ఆయనతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​, బంగాల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధన్​ఖర్​లు హాజరుకానున్నారు.

ఇదీ చూడండి: స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.