దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తోన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి, టీకా పంపిణీ కార్యక్రమంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రులతో బుధవారం మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమం వర్చువల్‌గా జరుగుతుందని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పరుగులు పెట్టించాలని కేంద్రం సన్నాహాలు చేస్తోంది.
టీకా పంపిణీ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమయ్యారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆయన దాదాపు మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకాలు వేసే ఖర్చును కేంద్రమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
తాజాగా భారత్‌లో సోమవారం ఒక్కరోజే 26,291 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. 85 రోజుల్లో ఇంత పెద్దమొత్తంలో ప్రజలు మహమ్మారి బారిన పడడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ 1కోటీ 13 లక్షల 85వేల 339 కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి: దేశంలో కొత్తగా 26,291 మందికి కరోనా