ETV Bharat / bharat

'మైత్రి సేతు' వంతెనను ప్రారంభించనున్న మోదీ - ఫెనీ నదిపై మైత్రి సేతు వంతెన

భారత్-బంగ్లాదేశ్​లను కలుపుతూ నిర్మించిన మైత్రి సేతు వంతెనను ప్రధాని మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. త్రిపురలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు, భగవద్గీత శ్లోకాలపై 21 మంది స్కాలర్ల వ్యాఖ్యానాలతో కూడిన 11 సంపుటాల చేతిరాత ప్రతులను దిల్లీలో విడుదల చేయనున్నారు.

MODI
'మైత్రి సేతు'ను ప్రారంభించనున్న మోదీ
author img

By

Published : Mar 9, 2021, 5:30 AM IST

భారత్-బంగ్లాదేశ్​లను కలుపుతూ ఫెనీ నదిపై నిర్మించిన 'మైత్రి సేతు' వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వంతెనను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా త్రిపురలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

మైత్రి సేతు వంతెన భారత్-బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలకు ప్రతీక అని ప్రధాని కార్యాలయం పేర్కొంది. 'జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్' ఈ వంతెన నిర్మాణం చేపట్టిందని తెలిపింది. ఇందుకోసం రూ. 133 కోట్లు వెచ్చించినట్లు స్పష్టం చేసింది. 1.9 కి.మీ పొడవు ఉండే ఈ వంతెన భారత్​లోని సబ్​రూమ్ నుంచి బంగ్లాదేశ్​లోని రామ్​గఢ్​ను కలుపుతుంది.

సబ్​రూమ్​లో ఇంటిగ్రేటెడ్ చెక్​పోస్టు సహా 208 నెంబర్ జాతీయ రహదారి నిర్మాణానికి ఈ సందర్భంగా మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన 40,978 ఇళ్లను, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్​ను ప్రారంభించనున్నారు.

భగవద్గీత చేతిరాత ప్రతులు

భగవద్గీత శ్లోకాలపై 21 మంది స్కాలర్ల వ్యాఖ్యానాలతో కూడిన 11 సంపుటాల చేతిరాత ప్రతులను మోదీ విడుదల చేయనున్నారు. ప్రధాని నివాసంలో జరిగే ఈ కార్యక్రమానికి జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కాంగ్రెస్ సీనియర్ నేత కరన్ సింగ్ హాజరుకానున్నారు.

సాధారణంగా ఒక్క వ్యాఖ్యాత అభిప్రాయంతోనే శ్రీమద్ భగవద్గీత రూపొందిస్తారని, కానీ తొలిసారి వివిధ పండితుల వ్యాఖ్యానాలతో ఇవి అందుబాటులోకి వస్తున్నాయని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఇందులో అరుదైన సంస్కృత వ్యాఖ్యానాలు చేతి రాతతో ఉంటాయని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.