పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన శనివారం.. అఖిలపక్ష భేటీ జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ అజెండాను వివరించనున్నారు.
ఈ మేరకు అన్ని పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం పంపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
తొలిసారి ఇలా..
పార్లమెంటు సమావేశాలకు ముందు అఖిల పక్ష భేటీ జరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఎప్పుడూ సమావేశాలకు ముందు జరిగే ఈ భేటీ.. ఈసారి ప్రారంభమైన ఒకరోజు తర్వాత జరగనుండటం గమనార్హం.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం.. అఖిలపక్ష సమావేశం నిర్వహించారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. సభ సజావుగా సాగేలా విపక్షాలు హామీ ఇచ్చాయని ఆయన తెలిపారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.