కొవిడ్ పరిస్థితులు భారత్-భూటాన్ సంబంధాన్ని మరింత బలోపేతం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం భూటాన్ ప్రధాని లొటాయ్ షెరింగ్‌తో ఫోన్లో సంభాషించారు మోదీ.
కొవిడ్ కట్టడిలో భాగంగా భారత్‌కు సహాయం చేసిన భూటాన్‌కు ధన్యవాదాలు తెలిపారు మోదీ. కొవిడ్‌ను అంతమొందించేందుకు.. భూటాన్ రాజు నంగ్యేల్ వాంగ్‌చుక్, ప్రధాని లొటాయ్ చేపట్టిన చర్యలను ప్రశంసించారు.
కొవిడ్ పరిస్థితులు ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత దృఢం చేశాయని ఇరు దేశాల ప్రధానులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:అన్నాడీఎంకేలో మళ్లీ వివాదాలు- చీలిక ఖాయమా?