నరేంద్ర మోదీ (pm modi news) 2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏటా తన పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల నేతల్లో (most popular leader in the world 2021) ఆయనే తొలి స్థానంలో నిలిచారు. సంపన్నదేశాల అధ్యక్షులు కూడా మోదీ(Modi latest news) దరిదాపుల్లో లేరు. మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా సంస్థ నిర్వహించిన ఈ సర్వే ఫలితాల్లో అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బెడైన్ ఆరో స్థానంలో ఉన్నారు. భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ వివరాలను ట్విట్టర్లో షేర్ చేశారు.
-
PM @NarendraModi ji continues to be the most admired world leader.
— Piyush Goyal (@PiyushGoyal) November 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
With an approval rating of 70% he once again leads among global leadershttps://t.co/zlyROFfBIV pic.twitter.com/3fa2O4cW0M
">PM @NarendraModi ji continues to be the most admired world leader.
— Piyush Goyal (@PiyushGoyal) November 6, 2021
With an approval rating of 70% he once again leads among global leadershttps://t.co/zlyROFfBIV pic.twitter.com/3fa2O4cW0MPM @NarendraModi ji continues to be the most admired world leader.
— Piyush Goyal (@PiyushGoyal) November 6, 2021
With an approval rating of 70% he once again leads among global leadershttps://t.co/zlyROFfBIV pic.twitter.com/3fa2O4cW0M
ఈ సర్వే ప్రకారం మోదీ(modi news today) 70శాతం ఓట్లతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 66శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ 58శాతం ఓట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ టాప్ 10లో చివరిస్థానంలో నిలిచారు.
సర్వే ఫలితాల ప్రకారం ప్రజాదరణలో టాప్ లీడర్లు
- నరేంద్ర మోదీ -70శాతం
- లోపెజ్ ఒబ్రేడర్, మెక్సికో అధ్యక్షుడు -66 శాతం
- మారియో డ్రాగీ, ఇటలీ ప్రధాని -58శాతం
- ఏంజెలా మెర్కెల్, జర్మనీ ఛాన్సలర్ -54శాతం
- స్కాట్ మోరిసన్, ఆస్ట్రేలియా ప్రధాని - 47శాతం
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు -44శాతం
- జస్టిన్ ట్రుడో, కెనడా ప్రధాని -43శాతం
- ఫుమియో కిషిదా, జపాన్ ప్రధాని -42శాతం
- మూన్ జె-ఇన్- దక్షిణ కొరియా అధ్యక్షుడు -41శాతం
- బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని -40శాతం
- పెడ్రో సాంచెజ్, స్పెయిన్ ప్రధాని -37శాతం
- ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు -36శాతం
- జైర్ బోల్సొనారో, బ్రెజిల్ అధ్యక్షుడు -35శాతం
మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడికి ఎంత ఆదరణ ఉందో తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహిస్తుంది. గతేడాది కూడా ప్రధాని మోదీనే(pm modi latest news) మొదటి స్థానంలో నిలిచారు. ఈసారి సర్వేలో భారత్లో 2,126మందిని ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసింది మార్నింగ్ కన్సల్ట్.
ఇదీ చదవండి: ఇరాక్ ప్రధానమంత్రిపై హత్యాయత్నం