ETV Bharat / bharat

'భాజపాకు, ప్రజలకు మధ్య వారధిలా కార్యకర్తలు' - undefined

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో భావోద్వేగ ప్రసంగం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచవ్యాప్తంగా భారత్​కు లభిస్తున్న ప్రశంసలు తన వల్ల కాదని, పార్టీ కార్యకర్తలపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వల్లేనని అన్నారు.

MODI NEWS
MODI NEWS
author img

By

Published : Nov 7, 2021, 5:34 PM IST

Updated : Nov 7, 2021, 10:45 PM IST

ప్రపంచమంతా భారత్​ను చూసి ప్రశంసిస్తోంది తన వల్ల కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భాజపా కార్యకర్తలపై దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకమే ఈ ప్రశంసలకు కారణమని పేర్కొన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి భావోద్వేగంతో ప్రసంగించిన ఆయన.. ప్రజలతో సన్నిహితంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలకు, పార్టీకి మధ్య వారధిలా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. భాజపా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సేవా హీ సంఘటన్ కార్యక్రమం గురించి విస్తృతంగా మాట్లాడిన ఆయన.. సమాజానికి పార్టీ కార్యకర్తలు చేసిన సేవను కొనియాడారు.

bjp national executive meeting
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం

"సాధారణ ప్రజలతో మమేకమైనందువల్లే భాజపా ఈ స్థాయిలో ఉంది. భాజపా ఏ కుటుంబానికీ కేంద్రంగా పనిచేయదు. పార్టీని కుటుంబమే నడిపించదు. సేవ, సంకల్పం, అంకిత భావమే పార్టీ విలువలు. తొలి నుంచీ పార్టీతో ఉన్న కార్యకర్తలను గౌరవించాల్సిన అవసరం ఉంది. భాజపా కార్యకర్తలు సరికొత్త సేవా సంస్కృతిని తీసుకొచ్చారు. దేశం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో 'సేవా హీ సంఘటన్' ద్వారా చేసిన సేవలు అసమానం.

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో కీలక చర్చ జరిగింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా అధ్యక్షులు.. సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజల సమస్యలపైనే దృష్టిసారిస్తున్నందున.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని భాజపా గెలుచుకుంటుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

bjp national executive meeting
సమావేశంలో యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, గడ్కరీ, రాజ్​నాథ్​

"ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల భాజపా అధ్యక్షులు, ముఖ్యమంత్రులు మాట్లాడుతుంటే... వారిలో ఓ విశ్వాసం కనిపించింది. గత ఐదేళ్లలో చేసిన పని నుంచి వచ్చిన సంతృప్తితోనే వారు ఇంత విశ్వాసంతో ఉన్నారు."

-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్!

జాతీయ కార్యవర్గ సమావేశంలో (BJP National Executive Meeting) కీలక తీర్మానాన్ని భాజపా ఆమోదించింది. వివిధ అంశాలతో కూడిన పార్టీ తీర్మానాన్ని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమావేశంలో ప్రవేశపెట్టగా... తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై, కిషన్ రెడ్డి, బిరెన్ సింగ్, అనురాగ్ ఠాకూర్, ప్రమోద్ సావంత్, అశ్వినీ వైష్ణవ్, పుష్కర్ ధామీ మద్దతు తెలిపారు.

దేశంలో వ్యాక్సినేషన్, పర్యావరణ మార్పులు, ఒకే దేశం ఒకే రేషన్, జమ్ముకశ్మీర్​ అభివృద్ధి, ఉగ్రవాదంపై పోరు వంటి అంశాలను ఈ తీర్మానంలో పొందుపరిచారు. ఈ విషయంలో మోదీ సర్కారు పనితీరును మెచ్చుకుంటూ తీర్మానించారు. మోదీ పాలనతో విదేశాల్లో భారతదేశ ఖ్యాతి పెరిగిందని తీర్మానంలో పేర్కొన్నారు.

మరోవైపు, విపక్షాలపై తీర్మానంలో విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని తీర్మానంలో పేర్కొన్నట్లు భాజపా నేత నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కరోనా సమయంలో ట్విట్టర్​కే పరిమితమై.. అనుమానాలు వ్యాప్తి చేశారని ఆరోపించారు. బంగాల్​లో తృణమూల్ కాంగ్రెస్ హింసను వ్యాప్తి చేస్తోందని విమర్శించారు.

మోదీకి సన్మానం

సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని.. నేతలు సన్మానించారు. దేశంలో వంద కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్​ పంపిణీని పూర్తి చేసినందుకు.. మోదీని గజమాలతో సత్కరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రులు, భాజపాపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 124 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

bjp national executive meeting
మోదీకి గజమాల వేస్తున్న సీనియర్ నేతలు

'ఇంకా ముందుంది...'

సమావేశంలో ప్రసంగించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. భాజపా ఇంకా శిఖరాగ్రాలకు చేరలేదని అన్నారు. త్వరలో పార్టీ మరింత ఉన్నత స్థితికి చేరుతుందని అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత విస్తరించేందుకు లక్ష్యాలు నిర్దేశించారని పార్టీ సీనియర్ నేత ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

కరోనా ప్రబలిన తర్వాత తొలిసారి.. భాజపా జాతీయ కార్యవర్గం ప్రత్యక్షంగా సమావేశమైంది. పార్టీ వ్యవస్థాపకులు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషీ సహా ఇతర రాష్ట్రాల్లోని జాతీయ కార్యవర్గ సభ్యులు, నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

bjp national executive meeting
ఎల్​కే అడ్వాణీ
bjp national executive meeting
వర్చువల్​గా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మురళీ మనోహర్ జోషి

ఇవీ చదవండి:

Last Updated : Nov 7, 2021, 10:45 PM IST

For All Latest Updates

TAGGED:

MODI NEWS
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.