ETV Bharat / bharat

'ముఖ్యమంత్రి గారూ.. మీ ఆరోగ్యం ఎలా ఉంది?'

PM Modi News: ప్రధాని నరేంద్ర మోదీ.. కర్ణాటక, బిహార్​ రాష్ట్ర ముఖ్యమంత్రుల ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఇరు రాష్ట్ర సీఎంల ఆరోగ్య పరిస్థితి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.

PM Modi News
ప్రధాని మోదీ
author img

By

Published : Jan 11, 2022, 10:47 PM IST

PM Modi News: కరోనా బారిన పడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పరామర్శించారు. ఫోన్​ ద్వారా ముఖ్యమంత్రులను పరామర్శించిన మోదీ.. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మహమ్మారి నుంచి వేగంగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

సాయంత్రం సుమారు 4.30 గంటలకు మోదీ బొమ్మైకు ఫోన్​ చేశారని.. దాదాపు 5 నిమిషాలు ప్రధాని మాట్లాడినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొవిడ్​ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై కూడా మోదీ ఆరా తీశారని.. మహమ్మారిని అదుపు చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నట్లు బొమ్మై స్పష్టం చేశారన్నారు.

వీరితో పాటు ఇటీవల కరోనా సోకిన దిగ్గజ​ గాయని లతా మంగేష్కర్​ ఆరోగ్యంపై కూడా మోదీ ఆరా తీశారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ కరోనా నుంచి కోలుకుంటున్నట్లు ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం రాజ్​నాథ్​ హోంక్వారంటైన్​లో ఉన్నారని.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి : యూపీలో భాజపాకు షాక్​- మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేల గుడ్​బై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.