ETV Bharat / bharat

'గత ప్రభుత్వాల వల్ల విభేదాలు- భాజపాతో అభివృద్ధి' - pm modi latest speech

PM Modi Manipur Visit: త్వరలో ఎన్నికలు జరగనున్న మణిపుర్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఇంఫాల్​లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ఆయన.. గత పాలకులు ఈశాన్య భారతాన్ని పూర్తిగా విస్మరించారని, భాజపా పాలనలోనే అభివృద్ధి సాధ్యమైందని అన్నారు.

PM MODI MANIPUR VISIT
భారత వృద్ధిలో మణిపుర్​ది కీలక పాత్ర'
author img

By

Published : Jan 4, 2022, 12:59 PM IST

Updated : Jan 4, 2022, 3:01 PM IST

PM Modi Manipur Visit: మణిపుర్​ సహా ఈశాన్య భారతాన్ని గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కొండ ప్రాంతాలు- లోయ ప్రాంతాలు అంటూ భేదాలు సృష్టించారని మండిపడ్డారు. ప్రస్తుతం.. తమ పాలనలో మణిపుర్​ అభివృద్ధి, శాంతికి చిహ్నంగా ఉందని తెలిపారు.

ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మణిపుర్​లో మంగళవారం పర్యటించారు మోదీ. అక్కడ ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగించారు.

"దిల్లీలోని గత ప్రభుత్వాలు మణిపుర్​ను విస్మరించాయి. కొండలు- లోయలు అంటూ భేదాలు సృష్టించేందుకు కుట్రపన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇక్కడ హింస లేదు. గత ప్రభుత్వాల చర్యలతో మణిపుర్​, ఈశాన్య భారత ప్రజలు ఏకాకిగా మిగిలిపోయారు. నేను ప్రధానినైన తర్వాత.. దేశాన్ని ఏకం చేసేందుకు చర్యలు చేపట్టాము."

--- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.

ఇంఫాల్​లో రూ.4,815కోట్లు విలువ చేసే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మోదీ. 13 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. వీటిల్లో 5 జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టులు, ప్రభుత్వ రెసిడెన్షియల్​ క్వార్టర్లు, మణిపుర్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పెర్ఫార్మెన్స్​ ఆర్ట్స్​, సీఐఐఐటీ(సెంటర్​ ఫర్​ ఇన్నోవేషన్​, ఇంక్యుబేషన్​, ట్రైనింగ్​), కేన్సర్​ ఆసుపత్రి ఉన్నాయి. మణిపుర్​వాసుల ఆరోగ్య సేవలను మెరుగుపరచడం, యువతకు ఉద్యోగాలు ఇవ్వడం సహా మొత్తం మీద రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టులతో సాధ్యపడుతుందని భాజపా చెబుతోంది.

ఇదీ చదవండి: 5వ తేదీన నీట్​లో 'ఈడబ్ల్యూఎస్' కోటాపై సుప్రీం అత్యవసర విచారణ

Last Updated : Jan 4, 2022, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.