జమ్ముకశ్మీర్‌లోని రాజకీయ పార్టీల నేతలతో ఈ నెల 24 ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు, రాజకీయ ప్రక్రియల పునరుద్ధరణపై చర్చించనున్నారు. 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్ ప్రత్యేకహోదాను రద్దు చేసి, రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఆ తర్వాత చేపట్టిన తొలి రాజకీయ ప్రక్రియ ఇదే.
ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర నాయకులు హాజరవుతారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ లోనె తదితరులు చర్చల్లో పాల్గొనేందుకు ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు.
ఇదీ చదవండి : ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్!