PM Modi Japan Quad summit: క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్లొనేందుకు జపాన్ వెళ్తున్న ప్రధాని మోదీ వివిధ దేశాల అధినేతలతో పాటు వ్యాపారవేత్తలు, భారత సంతతికి చెందిన ప్రజలతోనూ సమావేశం కానున్నారు. దాదాపు 40 గంటల పాటు ఆయన జపాన్‌లో ఉంటారు. ఆ సమయంలో 23 కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారని తెలుస్తోంది.
Modi Japan tour meetings: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధాన మంత్రులతో నిర్వహించే ద్వైపాక్షిక భేటీలతో పాటు వ్యాపారవేత్తలు, దౌత్యాధికారులు, భారత సంతతి ప్రజలు నిర్వహించే కార్యక్రమాలు వీటిలో ఉన్నాయి. మోదీ ఒక రాత్రి టోక్యోలో, మరో రెండు రాత్రులు విమాన ప్రయాణంలో ఉంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.
జపాన్ ప్రధాని కిషిద ఆహ్వానం మేరకు టోక్యో వెళ్తున్న నరేంద్ర మోదీ ఈ నెల 24న జరిగే క్వాడ్ నేతల మూడో సదస్సులో పాల్గొంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండో-పసిఫిక్ ప్రాంత పరిణామాలు, సమకాలీన అంతర్జాతీయ సమస్యలు, క్వాడ్ దేశాల ఉమ్మడి అంశాలపై అగ్రనేతలు పరస్పరం తమ అభిప్రాయాలు పంచుకునేందుకు, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకునేందుకు ఈ సదస్సు అవకాశం కల్పించనుంది.
ఇదీ చదవండి: