ప్రపంచంలోని దిగ్గజ ఆయిల్ కంపెనీల సీఈఓలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi meeting today) సమావేశమయ్యారు. అతిపెద్ద చమరుు సంస్థ అయిన సౌదీ ఆరామ్కో, రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ సహా పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు (Modi meeting with CEO) జరిపారు. పెట్రోలియం నిక్షేపాల అన్వేషణ, భారత్లోని హైడ్రోకార్బన్ రంగంలో ఉత్పత్తి, ఉద్గారాల తగ్గింపు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. (Modi news)


ఈ సమావేశానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, రోస్నెఫ్ట్ ఛైర్మన్ డాక్టర్ ఐగోర్ సెచిన్, సౌదీ ఆరామ్కో అధ్యక్షుడు ఆమిన్ నాసర్, భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ హాజరయ్యారు. పెట్రోల్ ధరలు దేశంలో రికార్డు స్థాయికి చేరుకున్న తరుణంలో ఈ భేటీకి(PM Modi news) ప్రాధాన్యం సంతరించుకుంది.

సెరా వీక్ కాన్ఫరెన్స్లో (Ceraweek global energy) భాగంగా ప్రపంచంలో చమురును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు దిల్లీలో సమావేశమవుతున్నాయి(Ceraweek Conference). ఆయా దేశాల ఇంధన శాఖ మంత్రులు, చమురు సంస్థల ప్రతినిధులు దీనికి హాజరు కానున్నారు. భారత్ తరఫున పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఈ సమావేశానికి హాజరవుతారు. అక్టోబర్ 20-22 మధ్య ఈ సమావేశాలు జరుగుతాయి.
ఇదీ చదవండి: పెట్రోల్ ధరలు తగ్గేలా అంతర్జాతీయంగా మోదీ ప్రయత్నాలు!