ETV Bharat / bharat

PMGKAY scheme: 'చాలా కుటుంబాల్లో రేషన్ సమస్య తీరింది'

గుజరాత్​లో ప్రధానమంత్రి గరీబ్​ కళ్యాణ్​ అన్న యోజన పథకం ద్వారా లబ్ధిపొందిన వారితో వర్చువల్​గా ముచ్చటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పథకం ద్వారా చాలా కుటుంబాల్లో రేషన్ సమస్య తీరడంపై అనందం వ్యక్తం చేశారు.

modi, PM Modi
నరేంద్ర మోదీ, పీఎం
author img

By

Published : Aug 3, 2021, 1:34 PM IST

Updated : Aug 3, 2021, 3:02 PM IST

ప్రధాన మంత్రి గరీబా కళ్యాణ్​ అన్న యోజన(PMGKAY) లబ్ధిదారులతో వర్చువల్​గా సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్​లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా హాజరయ్యారు.

PM Modi, modi
లబ్ధిదారులతో మోదీ వర్చువల్​ భేటీ

కరోనా సంక్షోభ సమయంలో పీఎంజీకేఏవై పథకం ద్వారా లక్షల మంది పేదలు లబ్ధిపొందారని మోదీ అన్నారు. ప్రభుత్వం లక్షల కుటుంబాలకు ఉచితంగా రేషన్​ అందించిందని హర్షం వ్యక్తం చేశారు.

PM Modi, modi
వర్చువల్​ వేదికగా

"స్వాతంత్య్రం అనంతరం ఏర్పడిన ప్రతి ప్రభుత్వం పేదలకు తక్కువ ధరకు రేషన్​ అందించాలనే అంశాన్ని లేవనెత్తింది. ఈ మేరకు కొన్ని పథకాలను కూడా తీసుకువచ్చింది. కానీ, దేశంలో పేదలకు పూర్తి స్థాయిలో సాయం అందలేదు. దేశంలో ఆహార నిల్వలు పెరిగాయి.. కానీ, ఆకలితో అలమటించేవారి సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు."

--నరేంద్ర మోదీ, ప్రధాని.

పేదలకు ఆపన్నహస్తం అందించడమే ప్రభుత్వం ప్రథమ లక్ష్యమని మోదీ అన్నారు. 2014 తర్వాత తాము అధికారంలోకి వచ్చాక చాలా మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆధార్​, రేషన్​ లింక్​తో నిజమైన లబ్ధిదారులను గుర్తించామని పేర్కొన్నారు. గరీబ్​ కళ్యాణ్​ అన్న యోజన ద్వారా చాలా కుటుంబాల్లో రేషన్ సమస్య తీరిందని అన్నారు.

ఈ పథకం ద్వారా.. ఒక్కో లబ్ధిదారుకు 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాలు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కొవిడ్​ సంక్షోభం నేపథ్యంలో ఈ పథకం ద్వారా చాలా మంది లబ్ధిపొందారు.

ఇదీ చదవండి:మోదీ నేతృత్వంలో భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం

Last Updated : Aug 3, 2021, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.