ETV Bharat / bharat

'కుటుంబ పార్టీలతో దేశానికి నష్టమే తప్ప లాభముండదు'.. అవినీతిపై యుద్ధానికి మోదీ పిలుపు - 77వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

PM Modi Independence Day Speech : దేశంలో అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలను సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలని కోరారు. కుటుంబ పార్టీలతో దేశానికి నష్టమే తప్ప లాభముండదని ఎద్దేవా చేశారు.

pm modi independence day speech
pm modi independence day speech
author img

By

Published : Aug 15, 2023, 10:04 AM IST

Updated : Aug 15, 2023, 11:03 AM IST

PM Modi Independence Day Speech : భారతదేశాన్ని అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు పట్టిపీడిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాటిని సమూలంగా నిర్మూలించాలని దేశ ప్రజలను కోరారు. అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలని.. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. సాంకేతిక అభివృద్ధి సాయంతో అవినీతిని అరికట్టే ప్రయత్నం వేగంగా సాగుతోందని అన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటపై జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.

  • #WATCH | PM Modi speaks on dynastic politics during his Independence Day speech

    "Today, 'parivarvaad' and appeasement has destroyed our country. How can a political party have only one family in charge? For them their life mantra is- party of the family, by the family and for… pic.twitter.com/xxmumTCc4Z

    — ANI (@ANI) August 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలను సమూలంగా నిర్మూలిస్తేనే దేశ అభివృద్ధి నిరాంటంకంగా సాగుతుంది. అవినీతి చెదలను సమూలంగా తుదముట్టించాలి. బుజ్జగింపు రాజకీయాలను మానుకోవాలి. పారదర్శక విధానాలతో అవినీతి నిర్మూలనకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు దేశానికి కోలుకోలేని నష్టం మిగిల్చాయి. అవినీతి, వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి."

--నరేంద్ర మోదీ, భారత ప్రధాని

PM Modi Speech On Independence Day : వారసత్వ రాజకీయాలు భారత ప్రజాస్వామ్యానికి కొత్త అర్థానిచ్చాయని ప్రధాని మోదీ తెలిపారు. కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబానికే మేలు అన్నట్లుగా తయారయ్యాయని ఉద్ఘాటించారు. కుటుంబ పార్టీలతో దేశానికి నష్టమే తప్ప లాభముండదని విమర్శించారు. 2047లో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ ఆవిష్కృతం కావాలంటే అవినీతికి స్వస్తి చెప్పాలని అన్నారు.

ప్రస్తుత నిర్ణయాలు రాబోయే 1,000 ఏళ్లపై ప్రభావం..
Narendra Modi Red Fort Speech : భారత్​లో ఉన్న జనాభా, ప్రజాస్వామ్యం, భిన్నత్వం ఈ మూడింటికి దేశానికి చెందిన అన్ని కలలను సాకారం చేసే సామర్థ్యం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ అమృత కాలంలో మనం తీసుకునే నిర్ణయాలు, వేసే అడుగులు రానున్న 1,000 ఏళ్ల దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయని ఉద్ఘాటించారు. దేశ స్వర్ణ చరిత్రకు అంకురార్పణ చేస్తాయన్నారు.

"మన దగ్గర ఇప్పుడు జనాభా , ప్రజాస్వామ్యం, భిన్నత్వం ఉంది. ఈ మూడింటికి భారత్‌కు చెందిన అన్ని కలలను సాకారం చేసే సామర్థ్యం ఉంది. నేను చెప్పే మాటలు గుర్తుంచుకోండి. సకల జనుల హితం కోసం చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు రానున్న 1000 ఏళ్లపై ప్రభావం చూపుతాయి. దేశ స్వర్ణ చరిత్రకు అంకురార్పణ చేస్తాయి."

--నరేంద్ర మోదీ, భారత ప్రధాని

'సొంతింటి కోసం కొత్త పథకం.. రూ.లక్షల్లో ప్రయోజనం'.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రకటన

'శాంతితోనే మణిపుర్​ సమస్యకు పరిష్కారం.. ప్రస్తుతం అక్కడ మెరుగైన పరిస్థితులు'.. ఎర్రకోటపై మోదీ

Last Updated : Aug 15, 2023, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.