ETV Bharat / bharat

గుప్కార్​ కూటమి నేతలతో మోదీ భేటీ - అఖిల పక్ష నేతలతో మోదీ మీటింగ్​

గుప్కార్​ కూటమి నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ.. దిల్లీలో గురువారం నిర్వహించిన భేటీ ముగిసింది. ఆర్టికల్ 370 రద్దుకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించడం, ప్రత్యేక హోదా రద్దును వెనక్కి తీసుకోవాలని ప్రధానిని నేతలు కోరినట్లు తెలుస్తోంది.

modi with gupkar
మోదీ సమావేశం
author img

By

Published : Jun 24, 2021, 3:07 PM IST

Updated : Jun 24, 2021, 9:23 PM IST

జమ్ము కశ్మీర్​కు చెందిన 14 మంది నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నిర్వహించిన భేటీ ముగిసింది. నేషనల్ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్​ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్​ కాన్ఫరెన్స్​ నాయకుడు సజ్జాద్​లోన్, గులాం నబీ ఆజాద్​, యూసుఫ్ తరిగామి సహా​ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

modi kashmir issue meeting
జమ్ముకశ్మీర్​కు చెందిన నేతలతో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా
modi meeting with gupkar front
సమావేశంలో మోదీ, అమిత్​ షా

ఆర్టికల్​ 370 రద్దు తర్వాత అక్కడి నేతలతో ప్రధాని సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్​ షా సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించడం, ప్రత్యేక హోదా రద్దును వెనక్కి తీసుకోవడం అనే అంశాలను గుప్కార్​ కూటమి ఈ సమావేశంలో ప్రధానంగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

modi in all party meeting
గుప్కార్​ కూటమి నేతలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ

భద్రత కట్టుదిట్టం..

అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి నియంత్రణ రేఖ ప్రాంతాల్లో 48 గంటలపాటు హై అలర్ట్‌ విధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది.

Last Updated : Jun 24, 2021, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.