ETV Bharat / bharat

ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు.. మోదీ కీలక ఆదేశాలు - గవర్నమెంట్ జాబ్స్ మోదీ న్యూస్

PM Modi Govt jobs
PM Modi Govt jobs
author img

By

Published : Jun 14, 2022, 9:55 AM IST

Updated : Jun 14, 2022, 11:52 AM IST

09:52 June 14

ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు.. మోదీ కీలక ఆదేశాలు

PM Modi Govt jobs: దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేశారు. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఖాళీలపై సమీక్ష నిర్వహించిన మోదీ.. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను మిషన్ మోడ్​లో భర్తీ చేయాలని వివిధ శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అన్ని శాఖలలోని మానవ వనరుల ప్రస్తుత స్థితిగతులపై మోదీ సమీక్ష నిర్వహించినట్లు తెలిపింది.

నిరుద్యోగంపై విపక్షాలు పదేపదే విమర్శలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజా ప్రకటన రావడం గమనార్హం. ప్రభుత్వ శాఖలలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని పలువురు నేతలు ఇటీవల విమర్శలు చేశారు.

'యువతకు నూతన విశ్వాసం..'
ఈ ప్రకటనపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించారు. నియామకాల ప్రకటన దేశ యువతలో నూతన విశ్వాసం నింపుతుందని ధీమా వ్యక్తం చేశారు. యువశక్తి నూతన భారతదేశానికి ఆధారమని షా పేర్కొన్నారు. యువతకు సాధికారత కల్పించేందుకు మోదీ నిరంతరం కృషిచేస్తున్నారని కొనియాడారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 14, 2022, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.