జాతిపిత మహాత్మా గాంధీ జయంతి (Gandhi Jayanti) సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆయనకు నివాళులు అర్పించారు. రాజ్‌ఘాట్‌ను సందర్శించిన మోదీ.. గాంధీ సమాధికి పుష్పాంజలి ఘటింటారు.
అంతకుముందు గాంధీని స్మరించుకుంటూ ట్వీట్ చేశారు మోదీ (PM Modi tweet today). బాపూజీ జీవితం, ఆదర్శాలు దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తాయని అన్నారు. గాంధీ ఆచరించిన సూత్రాలు సమకాలీన ప్రపంచానికి చాలా అవసరమని చెప్పారు. ఇవి లక్షలాది మందికి బలాన్నిస్తాయన్నారు.
అదేసమయంలో, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి శ్రద్ధాంజలి ఘటించారు మోదీ. ఆయన జీవితం దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తుందని అన్నారు.
మరోవైపు, రాజ్‌ఘాట్‌ను సందర్శించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. గాంధీజీకి నివాళులు అర్పించారు. ఆయన సమాధికి పూలమాల అలంకరించారు.
-
#WATCH President Ram Nath Kovind pays tribute to Mahatma Gandhi at Rajghat on his 152nd birth anniversary pic.twitter.com/kMA7U1JLAu
— ANI (@ANI) October 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH President Ram Nath Kovind pays tribute to Mahatma Gandhi at Rajghat on his 152nd birth anniversary pic.twitter.com/kMA7U1JLAu
— ANI (@ANI) October 2, 2021#WATCH President Ram Nath Kovind pays tribute to Mahatma Gandhi at Rajghat on his 152nd birth anniversary pic.twitter.com/kMA7U1JLAu
— ANI (@ANI) October 2, 2021
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సైతం రాజ్‌ఘాట్‌ను సందర్శించి గాంధీజీకి నివాళులు అర్పించారు. అనంతరం నేతలు విజయ్ ఘాట్‌కు వెళ్లి లాల్ బహదూర్ శాస్త్రికి శ్రద్ధాంజలి ఘటించారు.
గుటెరస్ ట్వీట్...
ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సైతం మహాత్ముడిని స్మరించుకున్నారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవమైన ఈ రోజు.. గాంధీ ప్రవచించిన శాంతి సందేశంతో మెరుగైన భవిష్యత్ నిర్మాణాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. శాంతి, విశ్వాసం, సహనంతో కూడిన కొత్త శకానికి నాంది పలకాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
ఇదీ చదవండి: ఆఖరి జన్మదినాన గాంధీ ఏం సందేశమిచ్చారు?