ETV Bharat / bharat

'14వ ఆర్థిక సంఘంలో తమిళనాడుకు రూ.5.42 లక్షల కోట్లు'

తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రాష్ట్ర అభివృద్ధి కోసం 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 5.42 లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

JP Nadda
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
author img

By

Published : Jan 15, 2021, 11:31 AM IST

తమిళనాడు అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని నొక్కిచెప్పారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రాష్ట్ర అభివృద్ధి కోసం 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.5.42 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు రాష్ట్రానికి నిధులు కేటాయించటంలో అలసత్వం ప్రదర్శించాయని విమర్శలు చేశారు.

తమిళనాడు పర్యటనలో భాగంగా పొంగల్​ ఉత్సవాల్లో పాల్గొన్నారు నడ్డా. తమిళనాడులో అమలవుతోన్న కేంద్ర పథకాల ప్రయోజనాలను వివరించారు.

" తమిళనాడు గొప్ప సంస్కృతికి, ఆధ్యాత్మికతకు నిలయం. మత గురువులు, నాయకుల ఆధ్వర్యంలో మతపరమైన భావాలను కాపాడుతున్న రాష్ట్రం. పొంగల్​ ఉత్సవాలను జరుపుకొనేందుకు ఇక్కడికి రావటం నాకు గొప్ప విజయం. ఇది రైతుల పండగ. యావత్​ దేశం మొత్తం జరుపుకొంటోంది. తమిళనాడులో దీనికి ప్రత్యేక నిర్వచనం ఉంది. మత గురువులకు రాష్ట్రం కేంద్రం.

దేశం అభివృద్ధిలో సాగేందుకు మోదీ జీ కృషి చేశారు. అదే సమయంలో తమిళనాడును అభివృద్ధి పథంలో నడిపించేందుకు పూనుకున్నారు. ఈ విషయం మాటల వరకే కాదు.. ఉదాహరణలతో చెబుతున్నా. యూపీఏ-2 సమయంలో 13వ ఆర్థిక సంఘం తమిళనాడుకు రూ.94 వేల కోట్లు కేటాయించింది. ఎన్​డీఏ హయాంలో 14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రూ.5.42 లక్షల కోట్లు కేటాయించింది."

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

తమిళనాడులోని టెక్స్​టైల్స్​, దాని పరిశ్రమల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1,600 కోట్లు కేటాయింటినట్లు గుర్తు చేశారు నడ్డా. వోకల్​ ఫర్​ లోకల్​ నినాదంతో ఆత్మనిర్భర్​ భారత్​ దిశగా సాగుతున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: 'సైనికులకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.