ఇరాన్ నూతన అధ్యక్షనిగా ఎన్నికైన ఇబ్రహీం రైసీకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్న మోదీ.. భారత్-ఇరాన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కలసి నడుద్దామని పిలుపునిచ్చారు.
"ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం రైసీకి అభినందనలు. భారత్, ఇరాన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా."
-ట్విట్టర్లో మోదీ
ఇబ్రహీం రైసీ.. నాయమూర్తి పదవి నుంచి దేశ అత్యున్నత పదవి చేపట్టిన వ్యక్తిగా నిలిచారు. ఇరాన్ చరిత్రలోనే ఈ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదవడం గమనార్హం.
ఇవీ చదవండి: