ETV Bharat / bharat

'జనవరి 22న ప్రతి ఇంట్లో 'రామ జ్యోతి' వెలిగించండి'- దేశ ప్రజలకు మోదీ పిలుపు - అయోధ్య రైల్వే స్టేషన్

PM Modi Ayodhya Speech : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు (జనవరి 22న) దేశప్రజలందరూ తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జనవరి 23 నుంచి భక్తులందరూ శ్రీరాముడిని దర్శించుకోవచ్చని తెలిపారు.

PM Modi Ayodhya Visit
PM Modi Ayodhya Visit
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 3:47 PM IST

Updated : Dec 30, 2023, 6:40 PM IST

PM Modi Ayodhya Speech : అయోధ్యలో రామ మందిర నిర్మాణం కల సాకారమైన నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. ఆలయ ప్రారంభోత్సవమైన జనవరి 22న రాత్రి దేశమంతా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో 'రామ జ్యోతి' వెలిగించి దీపావళి వేడుకలు చేసుకోవాలని సూచించారు. జనవరి 14 నుంచి దేశవ్యాప్తంగా అన్ని తీర్థక్షేత్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

  • #WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi says, "This historical moment has very fortunately come into the lives of all of us. We have to take a new resolution for the country and fill ourselves with new energy. For this, all the 140 crore countrymen should light Ram… pic.twitter.com/Dc52swEI8R

    — ANI (@ANI) December 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానితులు మాత్రమే రావాలని మోదీ సూచించారు. జనవరి 23 తర్వాత ప్రజలంతా అయోధ్యకు రావొచ్చని తెలిపారు. అయోధ్యను శుభ్రంగా ఉంచే బాధ్యత అయోధ్య వాసులదే అని ప్రధాని అన్నారు. అయోధ్యధామ్‌లో ఎక్కడా అపరిశుభ్రత కనిపించవద్దని చెప్పారు. ఈ మేరకు అయోధ్యలో జరిగిన సభలో ప్రసంగించారు.

  • #WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi says, "I have a request to all. Everyone has a wish to come to Ayodhya to be a part of the event on 22 January. But you know it is not possible for everyone to come. Therefore, I request all Ram devotees that once the formal… pic.twitter.com/pbL81WrsbZ

"చారిత్రాత్మక ఘట్టమైన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠకోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం భారత్​ను ముందుకు తీసుకెళ్తాయి.ఈ రోజు ఇక్కడ రూ.వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ ఆధునిక మౌలిక వసతులు భారత చిత్రపటంపై అయోధ్యను సగర్వంగా నిలుపుతాయి. నేటి సరికొత్త భారత్​ తీర్థక్షేత్రాలను సుందరంగా తీర్చిదిద్దుతోంది. వాటికి డిజిటల్ హంగులు అద్దడంలో లీనమై ఉంది. ప్రపంచంలో ఏ దేశమైనా, అవి అభివృద్ధిలో ఎంత ఎత్తుకు ఎదిగినా తమ వారసత్వ సంపదను కాపాడుకోవాలి. ఒకప్పుడు అయోధ్య శ్రీరాముడు టెంట్​లో ఉండేవాడు. ఇప్పుడు పక్కా ఇల్లు ఇచ్చాము. కేవలం రాముడికే కాదు దేశంలోని 4 కోట్ల మంది పేద ప్రజలకు కూడా కొత్త ఇళ్లు వచ్చాయి. అయోధ్యను అభివృద్ధి చేయడం ద్వారా ఇక్కడ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి."
--నరేంద్ర మోదీ, భారత ప్రధాని

'వందే భారత్' రైళ్లు, 'నమో భారత్'​ రైళ్ల తర్వాత ఈ రోజు కొత్త సిరీస్​ రైళ్లు వచ్చాయని వాటికి 'అమృత్​ భారత్' రైళ్లు అని నామకరణం చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వీటన్నిటి శక్తి భారతీయ రైల్వే అభివృద్ధిలో సహాయపడుతుందన్నారు. ఇక అయోధ్యలో రామమందిరం నిర్మించాక ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందనే విషయం దృష్టిలో పెట్టుకుని, స్మార్ట్​ అయోధ్యగా మార్చడానికి రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మోదీ తెలిపారు.

  • #WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi says, "Today after the Vande Bharat trains and Namo Bharat trains, the country has got a new series of trains... This has been named as Amrit Bharat trains... The power of all these three trains will help in the development of the… pic.twitter.com/JB6KQeujhI

"ఈరోజు నేను అయోధ్య ధామ్ విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ను ప్రారంభించాను. అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టడం సంతోషంగా ఉంది. వాల్మీకి మహర్షి రామాయణం ద్వారా శ్రీరాముడు చేసిన మంచి కార్యాలను మనకు పరిచయం చేశారు. ఆధునిక భారత్​లో, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్య ధామ్ రెండూ రామమందిరంతో మనల్ని కలుపుతాయి. ప్రస్తుతం అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్​కు 10-15 వేల మందికి సేవలందించే సామర్థ్యం ఉంది. ఈ స్టేషన్ పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత, ప్రతిరోజూ 60 వేల మంది అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగించవచ్చు"
--నరేంద్ర మోదీ, భారత ప్రధాని

తొలి ప్రయాణంలో హనుమాన్ చాలీసా పఠనం!
మహర్షి వాల్మికీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన మొదటి విమానంలో భక్తులు హనుమాన్​ చాలీసా పఠించారు. మరోవైపు అయోధ్య బాబ్రీ మసీదు స్థలం కేసు పిటిషనర్ ఇక్బాల్​ అన్సారీ అయోధ్యలో రోడ్​షో సందర్భంగా ప్రధాని మోదీకి పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు.

అయోధ్య రైల్వేస్టేషన్, ఎయిర్​పోర్టును ప్రారంభించిన మోదీ- జాతికి అంకితమిచ్చిన ప్రధాని

ఆధునిక వసతులు, ఆధ్యాత్మిక శోభతో అయోధ్య ఎయిర్​పోర్ట్- ఆలయంలా రైల్వే స్టేషన్!

Last Updated : Dec 30, 2023, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.