కరోనా వైరస్‌పై పోరాటంలో కీలక అస్త్రమైన వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్ విధానంలో కీలక మార్పులతో కేంద్రీకృత వ్యాక్సినేషన్ డ్రైవ్ తీసుకొచ్చింది. ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే ఉచితంగా టీకాలు పంపిణీ చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించారు.
మోదీ ప్రసంగంలోని కీలకాంశాలు:
- టీకాలకు అయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తుంది.
- 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా టీకాలు- 21న ప్రారంభం.
- రాష్ట్రాలకు టీకాను కొని ఉచితంగా ఇవ్వనున్న కేంద్రం.
- ప్రైవేటు ఆస్పత్రుల్లో సొంత ఖర్చుతో టీకా వేసుకునే అవకాశం- గరిష్ఠంగా రూ.150 సర్వీస్ ఛార్జి వసూలు.
- టీకాల ఉత్పత్తిలో 75 శాతం కేంద్రమే సేకరిస్తుందన్న ప్రధాని.
- ఉత్పత్తిలో 25 శాతం టీకాలు ప్రైవేటు రంగానికే కేటాయింపు.
- చిన్నారుల టీకా కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్న ప్రధాని.
- ముక్కు ద్వారా వేసే టీకా కోసం పెద్దఎత్తున ప్రయోగాలు.
- నవంబరు నాటికి 80 శాతం మందికి టీకాలు ఇస్తామని మోదీ ప్రకటన.
- 80 కోట్ల మంది పేదలకు దీపావళి వరకు ఉచితంగా ఆహార ధాన్యాలు.
ఇదీ చూడండి: 'జూన్ 21 నుంచి అందరికీ ఉచితంగా టీకా'