ETV Bharat / bharat

ఒమిక్రాన్​పై పోరాటంలో అదే కీలకం: మోదీ - నరేంద్ర మోదీ

కొవిడ్​ మహమ్మారిని ఓడించటంలో పౌరుల వ్యక్తిగత అప్రమత్తత, క్రమశిక్షమే దేశానికి అతిపెద్దబలమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 84వ మనుసులో మాట కార్యక్రమంలో మాట్లాడారు మోదీ. కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ మన తలుపు తట్టిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

Mann Ki Baat
మన్​ కీ బాత్​లో మోదీ
author img

By

Published : Dec 26, 2021, 11:32 AM IST

Updated : Dec 26, 2021, 12:08 PM IST

కొవిడ్​-19 మహమ్మారి కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ మన తలుపు తట్టిందన్న విషయాన్ని ప్రతిఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారిని ఓడించటంలో వ్యక్తిగత అప్రమత్తత, క్రమశిక్షణ అతిపెద్ద బలమని సూచించారు. కరోనా టీకా పంపిణీలో భారత్​ అపూర్వమైన ఘనత సాధించిందని.. అయితే, కొత్త వేరియంట్లు పుట్టుకోస్తున్న నేపథ్యంలో కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

2021 ఏడాదిలో చివరి, 84వ మనసులో మాట(మన్​ కీ బాత్​) కార్యక్రమంలో మాట్లాడారు మోదీ.

"ఈ కొత్త ఒమిక్రాన్​ వేరియంట్​ను మన శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రతి రోజు.. వారు కొత్త సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. కొత్త వేరియంట్​పై పోరాటంలో వ్యక్తిగత అప్రమత్తత, క్రమశిక్షణే దేశానికి అతిపెద్ద బలం. సమష్టి కృషితోనే కరోనాపై విజయం సాధిస్తాం. ఆ బాధ్యతతోనే మనం 2022లోకి అడుగుపెట్టాలి."

- నరేంద్ర మోదీ ప్రధానమంత్రి.

జనవరి 3 నుంచి 15-18 ఏళ్లలోపు వారికి కొవిడ్​-19 టీకా ఇవ్వనున్నట్లు శనివారం ప్రకటించారు మోదీ. అలాగే.. జనవరి 10 నుంచి ఫ్రంట్​లైన్​ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందికి బూస్టర్​ ఇస్తామని తెలిపారు. అలాగే 60 ఏళ్లు పైబడిన వారికి సైతం బూస్టర్​ డోస్​ ఇస్తామని, అయితే.. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు బూస్టర్​ తీసుకోవాలన్నారు.

మన్​ కీ బాత్​లో.. తమిళనాడు కూనూర్​ వద్ద వాయుసేన హెలికాప్టర్​ కూలిపోయి భారత త్రిదళాధిపతి జనరల్​ బిపన్​ రావత్​ దంపతులు దుర్మరణం చెందిన ఘటనను గుర్తు చేసుకున్నారు మోదీ. గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ ఒక్కరే మరణంతో చాలా రోజులు పోరాటం చేశారని, చివరకు ఆ పోరాటంలో ఓడిపాయారని తెలిపారు.

ఇదీ చూడండి: India Covid Cases: దేశంలో మరో 6,987 కరోనా కేసులు

Last Updated : Dec 26, 2021, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.