PM Kisan Yojana Ineligible Farmers : పీఎం కిసాన్ యోజన కింద.. బిహార్‌కు చెందిన 81వేల రైతులను అనర్హులుగా తేల్చారు వ్యవసాయ శాఖ అధికారులు. వారంతా 81.6 కోట్ల రూపాయల లబ్ధి పొందారని గుర్తించారు. తిరిగి వారి నుంచి ఆ సొమ్మును వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని బ్యాంకులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, పథకానికి అనర్హులైన ఇతర వ్యక్తులను తమ పరిశీలనలో గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.
"మొత్తం 81,595 రైతులు పీఎం కిసాన్ పథకం కింద సాయాన్ని పొందేందుకు అనర్హులు. వీరిలో 45,879 మంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. మరో 35,716 మందిని ఇతర కారణాల వల్ల అనర్హులుగా గుర్తించాం. వారు పొందిన 81.6 కోట్ల రూపాయలను తిరిగి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంబంధిత ఆధికారులను ఆదేశించాం." అని బిహార్ వ్యవసాయ శాఖ డెరక్టర్ అలోక్ రంజన్ ఘోష్ తెలిపారు.
సొమ్మును తిరిగి తీసుకోవాలని వ్యవసాయ శాఖ.. బ్యాంకర్లను కోరిందని రంజన్ ఘోష్ తెలిపారు. ఇటివలే జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ వ్యవహారాన్ని ప్రస్తావనకు తెచ్చినట్లు ఆయన వివరించారు. ఈ విషయంపై ఇప్పటికే రైతులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. కొందరి రైతుల బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేసినట్లు పేర్కొన్న రంజన్ ఘోష్.. సంబంధిత బ్యాంక్ ఖాతాల నుంచి ఇప్పటికే రూ.10.3 కోట్లు వసూలు చేసినట్లు వివరించారు.
ఏంటీ 'పీఎం-కిసాన్' యోజన?
PM Kisan Scheme Details : దేశంలో చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం.. 2019 ఫిబ్రవరి 24న పీఎం-కిసాన్ యోజనను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. రెండు హెక్టార్లు లేదా అంతకన్నా తక్కువ భూమి కలిగి ఉండి.. దేశీయ పౌరులైన రైతులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం. ఈ పథకం కింద అర్హులైన రైతుకు సంవత్సరానికి 6వేలు రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మొత్తం మూడు విడతలుగా వీటిని చెల్లిస్తుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రైతులను గుర్తిస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలు. బ్యాంక్ ఖాతాల ద్వారా రైతులకు నేరుగా ఈ సాయం అందుతుంది.
JDS BJP Alliance : 'పార్టీ మనుగడ కోసమే బీజేపీతో పొత్తు.. కుమారస్వామి లాంటి సీఎం దేశంలోనే లేరు!
'Modi Bilateral Talks : దేశాధినేతలతో మోదీ బిజీబిజీ.. కెనడా ప్రధానితో 'ఖలిస్థానీ' నిరసనలపై చర్చ