ETV Bharat / bharat

ప్రధాని న్యూ ఇయర్​ గిఫ్ట్​.. ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమ!

author img

By

Published : Dec 29, 2021, 6:50 PM IST

PM Kisan 10th Installment: నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు ప్రధాని నరేంద్రమోదీ. దేశవ్యాప్తంగా 10కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ. 20వేల కోట్లు అందనున్నాయి.

PM Modi
ప్రధాని మోదీ

PM Kisan 10th Installment: ప్రధాన మంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి (పీఎం-కిసాన్​) పథకానికి సంబంధించి 10వ విడత నిధులను ప్రధాని నరేంద్రమోదీ విడుదల చేయనున్నారు. 2022, జనవరి 1న 10కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ. 20వేల కోట్లు అందనున్నాయి.

ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్​ చేస్తామని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇప్పటివరకు రూ. 1.6లక్షల కోట్లను రైతు కుటుంబాలకు అందించామని తెలిపింది.

ఈ పథకం కింద కేంద్రం.. ఏటా రైతు కుటుంబాలకు రూ.6000ను.. మూడు విడతల్లో రూ.2000 చొప్పున అందిస్తోంది.

FPO Kisan Yojana: ఈ కార్యక్రమంలో భాగంగా.. 351 రైతు ఉత్పత్తి సంస్థలకు(ఎఫ్​పీఓ) రూ. 14 కోట్లు ఈక్విటీ గ్రాంటు అందించనున్నారు ప్రధాని మోదీ. ఈక్విటీ గ్రాంట్​ వల్ల 1.24లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది.

ఇదీ చూడండి: 'ఇమ్యూనిటీని ఏమార్చే సామర్థ్యం ఒమిక్రాన్​కు ఎక్కువే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.