ETV Bharat / bharat

Constitution Day 2021: 'ఆయన స్ఫూర్తి దేశానికి మార్గదర్శకం' - Constitution Day greetings pm modi

దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవం(నవంబరు 26) సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ(Pm Modi News Latest). ఈ మేరకు డాక్టర్. బీఆర్​ అంబేడ్కర్ వ్యాఖ్యలను ట్విట్టర్​ వేదికగా షేర్ చేశారు. మోదీతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హోం మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు.

modi and venkaiah
మోదీ, వెంకయ్య నాయుడు
author img

By

Published : Nov 26, 2021, 11:39 AM IST

రాజ్యాంగ దినోత్సవం(నవంబరు 26) సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ(Pm Modi News Latest). ఈ సందర్భంగా నవంబరు 4, 1948న రాజ్యాంగ పరిషత్తులో.. డాక్టర్. బీఆర్​ అంబేడ్కర్ స్పీచ్​ను ట్విట్టర్​ ద్వారా షేర్ చేశారు మోదీ. భారత మొదటి రాష్ట్రపతి డాక్టర్​. రాజేంద్రప్రసాద్ స్ఫూర్తి దేశానికి మార్గదర్శకమని కొనియాడుతూ ట్వీట్ చేశారు.

PM tweet
ప్రధాని మోదీ ట్వీట్

ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు..

రాజ్యాంగ దినోత్సవం(Constitution Day 2021) సందర్భంగా.. దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah naidu news). భారత రాజ్యంగ నిర్మాణానికి కృషి చేసిన డాక్టర్. బీఆర్ అంబేడ్కర్​, ఇంకా అనేక మంది మహనీయులకు భారతజాతి రుణపడి ఉందన్నారు. సమీకృత న్యాయం, స్వేచ్ఛ, సమానత్వమే ధ్యేయంగా రాజ్యాంగ నిర్మాణం జరిగిందన్నారు.

venkaiah tweets
వెంకయ్యనాయుడు ట్వీట్

ఆయన అడుగుజాడల్లో..

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా(Amit shah latest news) శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం.. ప్రజాస్వామ్యానికి ఆత్మ అని, ఐక్యత, ప్రగతి దానిలో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్​. బీఆర్​ అంబేడ్కర్​కు తలవంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడుస్తూ.. దేశప్రజలకు సంక్షేమ ఫలాలను అందించేందుకు మోదీ సర్కార్ కట్టుబడి ఉందన్నారు.

sha tweets
అమిత్​ షా ట్వీట్

రక్షణమంత్రి శుభాకాంక్షలు..

రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్ సైతం దేశ ప్రజలకు శుభాకాంక్షలు చేశారు.. ఈ మేరకు ట్విట్టర్​లో ప్రధాని మోదీ చేసిన ట్వీట్​ను షేర్ చేశారు.

ఇదీ చూడండి: Constitution Day: రెచ్చగొట్టిన బ్రిటిషర్లు- రాజ్యాంగం మూడోసారి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.