ETV Bharat / bharat

MBBS​ కాలేజీకి ఇంటర్​ విద్యార్థిని.. 4 రోజులు క్లాసులకు అటెండ్ అయ్యాక.. - ఇంటర్​ విద్యార్థిని అత్యుత్సాహం

ఎంబీబీఎస్​ క్లాస్​కు ఓ బాలిక నాలుగు రోజుల పాటు హాజరైంది. ఎవరికీ అనుమానం రాకుండా మేనేజ్​ చేసింది. ఎంబీబీఎస్​లో సీటు వచ్చిందని అందరికీ మెసేజ్​లు పెట్టింది. చివరకు ఏమైందంటే..​

Plus Two student attends first year MBBS class

author img

By

Published : Dec 9, 2022, 2:38 PM IST

ఇంటర్​ చదువుతున్న ఓ విద్యార్థిని.. ఎంబీబీఎస్​ మొదటి సంవత్సరం క్లాస్​కు నాలుగు రోజుల పాటు హాజరైంది. ఈ విషయం యాజమాన్యానికి తెలియకుండా జాగ్రత్త పడింది.
కేరళ మలప్పురం ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుతోంది. కోజికోడ్​ మెడికల్​ కాలేజీలో మొదటి సంవత్సరం క్లాస్​కు నాలుగు రోజుల పాటు వెళ్లింది. అటెండెన్స్​ కూడా వేసింది. ​ఐదో రోజు నుంచి రావడం మానేసింది. ఈ విషయం కళాశాల ప్రిన్సిపాల్​కు తెలిసింది. వివరాలు సేకరించగా.. అడ్మిషన్​ లిస్టులో ఆమె పేరు లేదు. కానీ అటెండెన్స్ రిజిస్టర్​లో ఉంది. ఆ తర్వాత ప్రిన్సిపాల్​ కోజికోడ్​ మెడికల్​ కాలేజీ పోలీస్​కు ఫిర్యాదు చేశారు.

తనకు ఎంబీబీఎస్​ సీటు వచ్చిందని చాలా మందికి ఆ బాలిక వాట్సాప్​ మెసేజ్​లు పంపిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆమె ఇంకా ఇంటర్​ చదువుతోందని.. మెడిసిన్​ చదవాలనే కోరికే, బహుశా ఆ బాలిక ఇలా చేయడానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటన జరిగిన తర్వాత.. ఆ బాలిక పేరు, వివరాలు తెలుసుకోవడానికి మెడికల్​ కాలేజీ యాజమాన్యం కూడా అంతర్గత విచారణ చేపట్టింది.

ఈ విషయంపై కోజికోడ్​ మెడికల్​ కాలేజ్​ వైస్​ ప్రిన్సిపాల్​ డాక్టర్​ సుజిత్​ కుమార్​ స్పందించారు. "ఇప్పటివరకు ఇలాంటి ఘటన మా కాలేజీలో జరగలేదు. క్లాస్​లోకి అనుమతించే ముందు ప్రతి విద్యార్థి అడ్మిట్​ కార్డు చెక్​ చేస్తాం. అయితే ఒక్కోసారి క్లాస్​ ఆలస్యంగా ప్రారంభమైనప్పుడు.. ఏం చెక్​ చేయకుండానే క్లాస్​కు అనుమతిస్తాం. ఈ విషయం తెలిసిన వెంటనే మేము విచారణ చేపట్టాం. అప్పటినుంచి ఆ విద్యార్థిని కనిపించడం లేదు. దీంతో మిగతా విద్యార్థులందరికీ అడ్మిట్​ కార్డులు జారీ చేశాం" అని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.