ETV Bharat / bharat

'ఆ రెండు నిరసనలు ఒక్కటి కాదు' - యూఏపీఏ చట్టంపై ఫైర్​ అయిన దేవాంగన కలిత

దేశంపై, వ్యవస్థపై నిరసన మధ్య తేడాను 'చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం' (యూఏపీఏ) సరిగా నిర్వచించడం లేదని దిల్లీలోని జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థినేత నటాషా నర్వాల్​ అన్నారు. ఈ కారణంగా విచారణ పూర్తి కాకముందే నిందితునిపై ఉగ్రవాది అనే ముద్ర వేస్తున్నట్లు చెప్పారు.

Natasha Narwal ,  Devangana Kalita
నటాషా
author img

By

Published : Jun 20, 2021, 9:24 AM IST

ఒక వ్యవస్థపై నిరసన వ్యక్తం చేయడం, దేశంపై నిరసన తెలపడం ఒక్కటి కాదని దిల్లీలోని 'జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం' (జేఎన్​యూ) విద్యార్థి నేత నటాషా నర్వాల్​ చెప్పారు. కఠినమైన 'చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం' (యూఏపీఏ) కింద అరెస్టయి, ఇటీవల బెయిల్​పై విడుదలైన ఆమె 'ఈటీవీ భారత్'​తో మాట్లాడారు.

దేశంపై, వ్యవస్థపై నిరసన మధ్య తేడాను యూఏపీఏ నిర్వచించడం లేదని చెప్పారు. దోషిగా రుజువయ్యేవరకు ఎవరైనా అమాయకులేననే నేర న్యాయ మూల స్వరూపాన్ని ఈ చట్టం ఉల్లంఘిస్తోందని విమర్శించారు.

"ఈ చట్టాన్ని రద్దు చేయాలని నేనేమీ చెప్పడం లేదు. బెయిల్​ నిబంధనల గురించే నా కలవరమంతా. బెయిల్​ ఇవ్వకపోవడం ప్రాథమిక హక్కులకు విరుద్ధం. విచారణలో దోషిగా రుజువయ్యేలోగానే ఒక వ్యక్తిపై ఉగ్రవాదిగా ముద్ర వేసే అధికారం ఆందోళనకరం. నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునే భారం నిందితునిపైనే పడుతోంది. ఇలా రుజువు చేసుకోలేక 10-20 ఏళ్ల పాటు కారాగారాల్లోనే మగ్గిపోయిన అనేక మందిని మనం చూశాం. సుదీర్ఘ విచారణ తరువాత అభియోగాల నుంచి విముక్తి లభించినా వారు కోల్పోయిన విలువైన కాలాన్ని ఎవరు తిరిగి ఇస్తారు?"

-నటాషా నర్వాల్​, జేఎన్​​యూ విద్యార్థి నేత

ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే దేశ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని మరో నాయకురాలు దేవాంగన కలిత ఆరోపించారు. తమ ఉద్యమం కొనసాగుతుంది చెప్పారు.

ఇదీ చూడండి: డ్రోన్లతో ఇంటికే మెడిసిన్​- దేశంలో తొలిసారి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.