ETV Bharat / bharat

'రెమ్​డెసివిర్​ అమ్మకాల్లో ఆ సంస్థల మాటేమిటి?' - దిల్లీ హైకోర్టు

దేశంలో రెమ్​డెసివిర్​ ఔషధాన్ని ఉత్పత్తి చేసే అన్ని సంస్థలను దేశీయ మార్కెట్లు విక్రయించేందుకు అనుమతించాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

Remdesivir
'రెమ్​డెసివర్​ అమ్మకాల్లో ఆ సంస్థల మాటేమిటి?'
author img

By

Published : May 3, 2021, 4:41 PM IST

Updated : May 3, 2021, 5:21 PM IST

రెమ్​డెసివిర్​ ఔషధాలను ఉత్పత్తి చేసే అన్ని సంస్థలను దేశీయ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై అభిప్రాయం తెలియజేయాలని కేంద్రాన్ని, వివిధ ఫార్మా సంస్థలను దిల్లీ హైకోర్టు ఆదేశించింది.

రెమ్​డెసివిర్​ ఔషధ ఎగమతులపై కేంద్రం నిషేధం విధించినప్పటికీ.. 6 నుంచి 8 సంస్థలు మాత్రమే దేశీయ మార్కెట్లో తమ ఉత్పత్తులను విక్రయించేందుకు అనుమతించారని.. పిటిషనర్​ దిన్​కర్​ బజాజ్​ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. మరో 25కుపైగా సంస్థలు.. విదేశాలకు ఎగుమతి చేసేందుకు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ, డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ ఫారిన్​ ట్రేడ్​ సహా వివిధ ఫార్మా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

ఇదీ చూడండి: 'టీకాలు కొనట్లేదనే వార్తలన్నీ అవాస్తవాలు'

Last Updated : May 3, 2021, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.