ETV Bharat / bharat

'దురుద్దేశంతోనే సెంట్రల్​ విస్టాపై పిటిషన్లు' - సెంట్రల్​ విస్టాను

ముందస్తు ప్రణాళికతో కావాలనే సెంట్రల్​ విస్టా ప్రాజెక్టును ఆపాలని పిటిషన్లు వేశారని దిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. సెంట్రల్​ విస్టాతో పాటు పలు ప్రాజెక్టులు, దిల్లీ మెట్రో నిర్మాణం జరుగుతోందని వాటిపై పిటిషన్​ వేయకుండా కేవలం సెంట్రల్​ విస్టాను ఆపాలని పిటిషనర్లు పేర్కొనడం ఇందుకు నిదర్శనం అని కేంద్రం ఆరోపించింది.

Central Vista
'సెంట్రల్​ విస్
author img

By

Published : May 11, 2021, 3:32 PM IST

దురుద్దేశంతో, ముందస్తు ప్రణాళిక ప్రకారమే కొత్త పార్లమెంట్​(సెంట్రల్​ విస్టా) నిర్మాణం ఆపాలని పిటిషన్లు వేశారని దిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో పాటు దిల్లీలో మెట్రోనూ కొన్ని ఏజెన్సీలు నిర్మిస్తున్నా.. వాటి గురించి పట్టించుకోకుండా కేవలం సెంట్రల్​ విస్టాను ఆపాలనే దురుద్దేశంతో పిటిషన్లు వేశారని ప్రభుత్వం పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసింది.

పని ప్రదేశంలో కొవిడ్​ జాగ్రత్తలు తీసుకుంటున్నామని కోర్టుకు తెలిపింది కేంద్రం. థర్మల్​ స్క్రీనింగ్​ కూడా చేస్తున్నామని వివరించింది. దీనిపై విచారణను కోర్టు మే12కు వాయిదా వేసింది.

సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించడం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని సోహైల్​ హశ్మీ, అన్య మల్హోత్రా హైకోర్టులో పిటిషన్లు వేశారు.

ఇదీ చదవండి: సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​ శంకుస్థాపనకు సుప్రీం అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.