ETV Bharat / bharat

'కొవిషీల్డ్'​ మూడో దశ ట్రయల్స్​కు ఎన్​రోల్​మెంట్​ పూర్తి - కొవిషీల్డ్ వ్యాక్సిన్​పై సీరమ్ ప్రకటన

సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్​ఐఐ), భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎం​ఆర్) సంయుక్తంగా కొవిషీల్డ్​ వ్యాక్సిన్​పై కీలక ప్రకటన చేశాయి. ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్​ ఎన్​రోల్​మెంట్ ప్రక్రియ పూర్తయినట్లు గురువారం వెల్లడించాయి.

Phase-3 clinical trails for COVISHIELD completed
కొవిషీల్డ్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్
author img

By

Published : Nov 12, 2020, 1:50 PM IST

కొవిడ్ 19 వ్యాక్సిన్ 'కొవిషీల్డ్'​ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఎన్​రోల్​మెంట్ ప్రక్రియ పూర్తయినట్లు పుణె కేంద్రంగా పని చేస్తున్న సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్​ఐఐ), భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎం​ఆర్) సంయుక్తంగా గురువారం ప్రకటించాయి. అమెరికాకు చెందిన నోవావాక్స్ అభివృద్ధి చేసిన ఈ టీకా క్లినికల్ ట్రయల్స్​ కోసం ఐసీఎంఆర్​, ఎస్​ఐఐలు కలిసి పనిచేస్తున్నాయి.

మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు జట్టుకట్టడం మంచి పరిణామంగా ఐసీఎంఆర్ అభివర్ణించింది. ఈ భాగస్వామ్యం ద్వారా వ్యాక్సిన్ ట్రయల్స్​లోని సైట్ రుసుముల కోసం ఐసీఎంఆర్ నిధులు సమకూర్చగా.. ఇతర ఖర్చులకు సీరం నిధులు అందించింది.

ప్రస్తుతం ఎస్ఐఐ, ఐసీఎంఆర్​లు కొవిషీల్డ్ వ్యాక్సిన్ 2/3 దశల క్లినికల్ ట్రయల్స్​ను దేశంలోని 15 వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాయి. అక్టోబర్ 31 నాటికే 1,600 మంది ట్రయల్స్​ కోసం ఎన్​రోల్​మెంట్ చేసుకున్నారు. క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఈ టీకా కచ్చితమైన పరిష్కారం ఇస్తుందని ఐసీఎంఆర్ ఆశాభావం వ్యక్తం చేసింది. కొవిషీల్డ్​ భారత్​లో పరీక్షలు నిర్వహిస్తున్న అత్యాధునిక వ్యాక్సిన్​గా పేర్కొంది.

ఇదీ చూడండి:ఐఐఎస్​సీ నుంచి వేడిని తట్టుకునే కరోనా వ్యాక్సిన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.