కేరళలోని అధికార ఎల్‌డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌తో రాష్ట్ర ప్రజలు విసుగు చెందారన్న మోదీ.. భాజపా నాయకత్వంలో అభివృద్ధిని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేరళ పతనంథిట్ట జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
"ఇప్పటివరకు జరిగింది చాలు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో యూడీఎఫ్, ఎల్డీఎఫ్కు తగిన బుద్ధి చెప్పాలి. ప్రజలు.. భాజపా అభివృద్ధి అజెండాను చూస్తున్నారు."
- ప్రధాని నరేంద్ర మోదీ
విద్యావంతులను రాజకీయాల్లోకి తీసుకురావడానికి భాజపా ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 'మెట్రోమ్యాన్' శ్రీధరన్ కేరళలో పోటీ చేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కేరళతో పాటు దేశాభివృద్ధికి ఆయన ఎంతో సహకారం అందించారని ప్రశంసించారు. ఇప్పుడు సమాజానికి సేవ చేయడానికి భాజపాలో చేరారని తెలిపారు మోదీ.
ఇదీ జరిగింది: 'తమిళ ప్రజలు విశాల హృదయులు'