ETV Bharat / bharat

'ఫోన్ల ట్యాపింగ్​'పై మాటల యుద్ధం

కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాకింగ్​పై భాజపా, కాంగ్రెస్​ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని, ఫోన్ల హ్యాకింగ్​పై దర్యాప్తు చేయాలని డిమాండ్​ చేసింది కాంగ్రెస్​. ఆ పార్టీ ఆరోపణలను భాజపా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

Pegasus spyware issue
భాజపా, కాంగ్రెస్​ల మధ్య మాటల యుద్ధం
author img

By

Published : Jul 19, 2021, 7:21 PM IST

దేశంలోని పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాకింగ్​పై దుమారం చెలరేగింది. ఈ అంశంపై భాజపా, కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ వ్యవహారంలో ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి హస్తం ఉందని ఆరోపించారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్​ ఖర్గే. అమిత్​ షా రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

" రాహుల్​ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, కేంద్ర మంత్రులపైనా.. ప్రధాని, హోంమంత్రి దాడులు చేస్తున్నారు. ఫోన్ల ట్యాపింగ్​పై దర్యాప్తు చేపట్టే ముందే అమిత్​ షా రాజీనామా చేయాలి. మోదీపైనా ఈ దర్యాప్తు జరగాలి. "

- మల్లికార్జున్​ ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత

డిజిటల్​ ఇండియాను ప్రధాని మోదీ ప్రమోట్​ చేస్తానని చెప్పారని, కానీ, ప్రస్తుతం నిఘా భారత్​ను చూస్తున్నామని ఆరోపించారు లోక్​సభలో కాంగ్రెస్​పక్ష నేత అధిర్​ రంజన్​ చౌదరి. తమ ఉత్పత్తులను ప్రభుత్వం ప్రత్యేకంగా నేరాలు, ఉగ్రవాదాన్ని నిరోధించేందుకే వినియోగిస్తోందని ఎన్​ఎస్​ఓ చెబుతోందని, కానీ, వారు పెగాసస్​ను మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు. విపక్షాల తరఫున పార్లమెంట్​లో ఈ విషయాన్ని లేవనెత్తుతామని తెలిపారు.

తిప్పికొట్టిన భాజపా..

కాంగ్రెస్​ ఆరోపణలు నిరాధారమైనవని, వాటిని ఖండిస్తున్నామని తెలిపారు రవిశంకర్​ ప్రసాద్​.

రవిశంకర్​ ప్రసాద్​

" ఫోన్ల ట్యాపింగ్​ గురించి చెబుతున్న వారు.. ఆ డేటాబేస్​లో ఉన్న ఏదైనా నంబర్​కు​ పెగాసస్​తో సంబంధం ఉన్నట్లు నిర్ధరించలేదు. ఇది చాలా వింత పరిస్థితి. పెగాసస్​ ప్రాజెక్ట్​ రిపోర్ట్​లో చూపిన వాటిని ఎన్​ఎస్​ఓ తిరస్కరించింది. గందరగోళ పరిస్థితులు సృష్టించేందుకు పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలకు ముందు పెగాసస్​ కథను పక్కా ప్రణాళితో వెలుగులోకి తీసుకొచ్చారా? ది వైర్​ పేరు కూడా బయటకు వచ్చింది. కానీ వారి కథనాల్లో చాలా వరకు తప్పు అని తేలడం నిజం కాదా? పెగసస్​తో భాజపా, కేంద్రానికి సంబంధం ఉందని రుజువు చేసే సాక్ష్యాలు ఏమీ లేవు."

- రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి.

'ముఖ్యమైన కార్యకలాపాల సమయంలోనే ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి? ట్రంప్​ పర్యటన సందర్భంగా అల్లర్లు జరిగాయి. 2019 ఎన్నికల​ సమయంలో పెగాసస్ స్టోరీ చక్కర్లు కొట్టింది. పార్లమెంట్​ సమావేశాలు, కాంగ్రెస్​ దుర్భర పరిస్థితుల్లో ఉన్న సమయంలోనే మళ్లీ వెలుగులోకి వచ్చింది ' అని ప్రశ్నించారు రవిశంకర్​ ప్రసాద్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.