ETV Bharat / bharat

నాలుగు సెకన్లలో.. శరీరంపై కరోనాను అంతం చేసే యంత్రం - COVID DISINFECTION ON BODY

శరీరంపై కరోనాను అంతం చేసే డిసిన్ఫెక్ట్ యంత్రాన్ని (Covid Disinfection Machine) ఐఐటీ పరిశోధకులు రూపొందించారు. దీన్ని ప్రయోగాత్మకంగా పట్నాలోని ఎయిమ్స్‌ వద్ద ఏర్పాటు చేశారు.

covid disinfection machine
కొవిడ్ డిస్​ఇన్​ఫెక్షన్ యంత్రం
author img

By

Published : Oct 31, 2021, 7:44 AM IST

శరీరం, దుస్తులపై ఉన్న కరోనా వైరస్‌ను నాలుగు సెకన్లలో అంతంచేసే 'ఫుల్‌ బాడీ డిసిన్ఫెక్ట్‌ యంత్రం'ను (Covid Disinfection Machine) ఐఐటీ-పట్నా పరిశోధకులు రూపొందించారు. ప్రయోగాత్మకంగా దీన్ని పట్నాలోని ఎయిమ్స్‌ వద్ద ఏర్పాటు చేశారు. దీని ద్వారం గుండా ఇవతలి నుంచి అవతలికి వెళ్తే సరిపోతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన, సురక్షితమైన ద్రావణాన్ని ఈ పరికరం పిచికారి చేస్తుంది. మూడు మోడళ్లలో ఈ యంత్రాన్ని రూపొందించామని, ఇందుకు రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వ్యయమవుతుందని పరిశోధనకర్త వరుణ్‌ కుమార్‌ సాహి తెలిపారు. కరోనా విజృంభిస్తున్న (Covid news) సమయంలో ఈ పరికరం తయారీపై దృష్టి సారించామని, ఎలాంటి ద్రావణాన్ని వినియోగించడం వల్ల హాని ఉండదన్న విషయమై అనేక పరీక్షలు చేపట్టి దీనికి తుదిరూపు ఇచ్చామని చెప్పారు.

ఇదీ చదవండి: ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొవిడ్‌ ప్రమాద ఘంటికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.