అత్యాచార కేసులో వివాదాస్పద ఆదేశాలు జారీచేసిన సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అవినాష్ కుమార్.. న్యాయపరమైన విధులు చేపట్టకుండా పట్నా హైకోర్టు(Patna High Court) నిషేధించింది. మధుబని జిల్లా(Madhubani News) జజ్జన్పుర్ సబ్ డివిజన్‌లో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ అవినాష్ కుమార్(Avinash Kumar Judge).. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు న్యాయపరమైన విధులు చేపట్టవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఆరు నెలల పాటు గ్రామంలోని మహిళల బట్టలు ఉతకడం సహా.. ఉచితంగా ఇస్త్రీ కూడా చేయాలనే షరతుపై అత్యాచార కేసులో ఓ నిందితుడికి జస్టిస్ అవినాష్ కుమార్ బెయిల్ మంజూరు చేశారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తీర్పు వెలువడిన రెండు రోజులకే హైకోర్టు స్పందించి చర్యలు చేపట్టడం గమనార్హం.
జస్టిస్ అవినాష్ కుమార్(Avinash Kumar Patna High Court) గతంలోనూ వివాదాస్పద తీర్పులు వెలువరించినట్లు న్యాయ వర్గాలు పేర్కొన్నాయి.
ఇవీ చదవండి: