ETV Bharat / bharat

'ఎదురులేని పతంజలి- ఆయుర్వేదంతో 5కోట్ల మంది రోగాలు నయం!- తెలంగాణలో భారీ ప్రాజెక్టు' - పతంజలి యోగా పీఠ్

Patanjali Yogpeeth Institute : తెలంగాణలో త్వరలో భారీ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు పతంజలి సంస్థ తెలిపింది. పతంజలి యోగా పీఠ్ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. అలోపతి వైద్యులు నయం చేయలేని రోగాలను.. ఆయుర్వేదంతో నయం చేసినట్లు ఈ సందర్భంగా బాబా రామ్​దేవ్ తెలిపారు.

Patanjali Yogpeeth Institute Ramdev Baba

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 5:15 PM IST

Patanjali Yogpeeth Institute : దక్షిణ భారత్​లో పతంజలిని విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు పంతంజలి యోగా పీఠ్ సహవ్యవస్థాపకుడు బాబా రామ్​దేవ్ తెలిపారు. త్వరలో తెలంగాణ, కర్ణాటక పరిసర రాష్ట్రాల్లో పెద్ద ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు ఏర్పడటమే కాకుండా యోగా, ఆయుర్వేదం ద్వారా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన వస్తుందన్నారు. మంగళవారం.. ఆచార్య బాలకృష్ణతో కలిసి బాబా రామ్​దేవ్ మీడియాతో మాట్లాడారు.

5 కోట్ల మంది రోగాలు నయం
తాము ఇప్పటివరకు తాము చేసిన 3వేల అధ్యయనాల్లో.. చనిపోయిన కణాలను యోగా, ఆయుర్వేదం ద్వారా పునరుజ్జీవింపజేయవచ్చని తేలినట్లు బాబా రామ్​దేవ్ చెప్పారు. కణాలతోపాటు శరీరంలోని వ్యవస్థలను బాగు చేయగలమన్నారు. ఇప్పటివరకు తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న 5కోట్ల మందికి రోగాలు నయం చేసినట్లు తెలిపారు. అలోపతి వైద్యులు వారి రోగాన్ని నయం చేయలేమని చెప్పినట్లు బాబా రామ్​దేవ్ పేర్కొన్నారు.

Patanjali Yogpeeth Institute Ramdev Baba
రామ్​దేవ్ బాబా

"ఇప్పటివరకు మందులకే ఆధారాలు లేవు. యోగంలో ఆ విషయం గురించి ఎవరూ ఆలోచించనేలేదు. కణాలను రిపేర్‌ చేయటంతోపాటు పునరుజ్జీవింపజేసి రోగాన్ని నయం చేయాలి. కాలేయ కణాలను రిపేర్‌ చేస్తే కాలేయ సంబంధిత ప్యాటీ లివర్‌, హెపటైటీస్‌ను నయం చేయవచ్చు. ఇది మేం రోజూ చేసే పని. మూత్రపిండాల కణాలను రిపేర్‌ చేయటంతోపాటు పునరుజ్జీవింపజేయవచ్చు. అప్పుడు మూత్రపిండాలు, కాలేయ మార్పిడి అవసరమే ఉండదు. గుండెకణాలను పునరుజ్జీవింపజేస్తే పేస్‌ మేకర్‌ అవసరం ఉండదు. హార్ట్‌ బ్లాకేజ్‌ను రివర్స్‌ చేస్తే యాంజియోప్లాస్టీ, బైపాస్‌ అవసరమే లేదు."
-బాబా రామ్‌దేవ్‌, పతంజలి యోగాపీఠ్‌ సహ-వ్యవస్థాపకుడు

1995లో దివ్య యోగా ఫార్మసీ ఏర్పాటు కోసం రూ.3500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు పతంజలి యోగాపీఠ్ సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ. అవినీతి అధికంగా ఉన్న ఆ కాలంలో.. ఎలాంటి ముడుపులు చెల్లించకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేయించినట్లు తెలిపారు. అనేక ఏళ్లు ఉత్తరాఖండ్ అడవుల్లో గడిపిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రారంభంలో కొందరు తమను విశ్వసించలేదని, ఇంకొందరు మాత్రం తమ పనిపై నమ్మకం ఉంచారని తెలిపారు. ఉచితంగా చికిత్స ప్రారంభించి.. అనేక మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు.

"పతంజలి యోగాపీఠ్ ఏర్పాటు చేసినప్పుడు మా ఖాతాలో రూ.25లక్షలే ఉన్నాయి. ఆర్కిటెక్ట్ కోసమే రూ.25 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. తర్వాతి కాలంలో.. చిన్న చిన్న యోగా క్యాంప్​లు ఏర్పాటు చేస్తూ వచ్చాం. కోట్లాది రూపాయలు మా ఖాతాలో జమ అయ్యాయి. హరిద్వార్​లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ పార్క్​ను పతంజలి నడుపుతోంది. దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు విదేశాలకు సైతం ఆహార పదార్థాలు సప్లై చేస్తున్నాం. త్వరలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నాం"
-ఆచార్య బాలకృష్ణ, పతంజలి యోగాపీఠ్ సహ వ్యవస్థాపకుడు

యోగా గురువు రామ్​దేవ్, ఆచార్య బాలకృష్ణ కలిసి పతంజలి యోగాపీఠ్​ ఇన్​స్టిట్యూట్​ను స్థాపించారు. ఇన్నేళ్లలో అనేక ఒడుదొడుకులను చూశారు. చిన్నగా ప్రారంభించి.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థగా పతంజలిని తీర్చిదిద్దారు. హరిద్వార్​లో ఈ సంస్థ ప్రధాన కేంద్రం ఉంది. అయితే, పతంజలి యోగాపీఠ్​కు సంబంధించిన వివిధ సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్నాయి.

Patanjali Oil Palm Plantation : అసోంలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ మొక్కలు పెంపకం.. కీలక పాత్ర పోషిస్తున్న పతంజలి!

'విదేశీ సంస్థల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.