సామాజిక మాధ్యమ దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్లకు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగ నియంత్రణపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 21న కమిటీ ముందు సంస్థల ప్రతినిధులు హజరుకావాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు లోక్‌సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది.