ETV Bharat / bharat

'ఖాతాల నిలిపివేతపై ట్విట్టర్​ను వివరణ అడుగుతాం' - ట్విట్టర్​ న్యూస్​

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​, కాంగ్రెస్​ ఎంపీ ఖాతాలను నిలిపివేయటంపై ట్విట్టర్​ను వివరణ కోరనున్నట్లు పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. భారత్​లో సేవలకు ఎలాంటి నిబంధనలు, విధానాలు పాటిస్తున్నారో తెలియజేయాలని స్పష్టం చేశారు ఐటీ విభాగంపై ఏర్పాటైన స్థాయీ సంఘం ఛైర్మన్​ శశిథరూర్​.

కాంగ్రెస్​ ఎంపీ శశి థరూర్​
author img

By

Published : Jun 26, 2021, 12:13 PM IST

కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​, కాంగ్రెస్​ ఎంపీ శశి థరూర్​ ఖాతాలను శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేసింది ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్​. దీనిపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్​ ఎంపీ. ఖాతాల నిలిపివేతపై వివరణ ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు.

"సమాచార సాంకేతిక విభాగంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్మన్​గా.. రవిశంకర్​ ప్రసాద్​, నా ఖాతాల నిలిపివేతపై వివరణ ఇవ్వాలని ట్విట్టర్​ ఇండియాను కోరనున్నాం. భారత్​లో సేవలకు ఎలాంటి నిబంధనలు, విధానాలు పాటిస్తున్నారో ట్విట్టర్​ తెలపాల్సి ఉంటుంది. "

- శశి థరూర్​, కాంగ్రెస్​ ఎంపీ.

అంతకు ముందు తన ఖాతా నిలిపివేతపై ట్వీట్​ చేశారు శశిథరూర్​. 'సమస్యను వివరించేందుకు నా ఖాతాను ట్విట్టర్​ మరోమారు నిలిపివేసింది. ఈ విషయంలో తొలి ట్వీట్​లో కాపీరైట్​ వీడియో ఉన్నట్లు పేర్కొంది. డీసీఎంఏ నోటీసుకు స్పందనగా.. ఖాతాను లాక్​ చేయటం ఒక పిచ్చి చర్య. వీడియోను తొలగించటం చేస్తే సరిపోతుంది. ట్విట్టర్​ ఇంకా చాలా తెలుసుకోవాలి. 'అని రాసుకొచ్చారు.

ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ఖాతాను.. అమెరికా డిజిటల్​ మిలేనియమ్​ కాపీరైట్​ యాక్ట్​ ఉల్లంఘనల పేరుతో సుమారు గంటపాటు నిలిపివేసింది ట్విట్టర్​. దీనిపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి. ట్విట్టర్​ చర్య.. భారత ఐటీ చట్టం 2021 రూల్స్​ను ఉల్లంఘించిందని స్పష్టం చేశారు. ఎలాంటి నోటీసు లేకుండా ఈ చర్యకు పూనుకోవటం సరికాదని హెచ్చరించారు.

ఇదీ చూడండి: కేంద్ర ఐటీ మంత్రికే ట్విట్టర్​ ఝలక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.