ETV Bharat / bharat

Parliament live: నిరసనల మధ్య ఉభయ సభలు మంగళవారానికి వాయిదా - పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు

Parliament winter sessions
పార్లమెంట్​ సమావేశాలు
author img

By

Published : Nov 29, 2021, 10:54 AM IST

Updated : Nov 29, 2021, 3:41 PM IST

15:37 November 29

చర్చకు విపక్షాల పట్టు- ఉభయ సభలు మంగళవారానికి వాయిదా

పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు(Parliament winter sessions) ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ నిరసనలు చేపట్టారు. దీంతో తొలిరోజే ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.

లోక్​సభలో..

మొదట సభలు ప్రారంభమైన వెంటనే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన సభ్యులకు నివాళి అర్పించారు. లోక్​సభలో ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు స్పీకర్​ ఓం బిర్లా. దానిని విపక్షాలు అడ్డుకున్నాయి. రైతు సమస్యలు సహా ఇతర ప్రజాసంక్షేమ అంశాలపై చర్చ జరగాలని పట్టుబట్టాయి. సహకరించాలని విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గకపోవటం వల్ల సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్​.

ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ(Parliament winter sessions) విపక్షాలు ఆందోళనలు కొనసాగించారు. ఈ క్రమంలో కొత్త సాగు చట్టాల రద్దు బిల్లును(The Farm Laws Repeal Bill 2021) లోక్​సభలో ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. బిల్లుపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వారి డిమాండ్​ను తిరస్కరించిన స్పీకర్​ ఓం బిర్లా.. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం విపక్షాల ఆందోళనలు కొనసాగటం వల్ల సభను మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా పడింది.

తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించటం వల్ల సభను మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు స్పీకర్​.

రాజ్యసభలో..

రాజ్యసభ ప్రారంభమైన కొద్ది సమయానే గంట సేపు వాయిదా పండింది. విపక్షాల ఆందోళనలు సహా ఇటీవల మృతి చెందిన ప్రస్తుత సభ్యుడు ఆస్కార్​ ఫెర్నాండెజ్​పై గౌరవ సూచకంగా ఛైర్మన్​ వెంకయ్య నాయుడు సభను మధ్యాహ్నం 12.20 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన సభలో విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. దీంతో సభ మరోసారి మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది.

సభ తిరిగి ప్రారంభం కాగానే.. సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. దీనిపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్​ చేశాయి. అందుకు అంగీకరించకపోవటం వల్ల ఆందోళనకు చేపట్టాయి. విపక్షాల నిరసనల మధ్యే మూజువాణి ఓటు ద్వారా బిల్లుకు ఆమోదం తెలిపారు వైస్​ ఛైర్మన్​. సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైన ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా మరోమారు అర్ధగంటపాటు వాయిదా పడింది.

తిరిగి ప్రారంభమైన క్రమంలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. పలు అంశాలపై కేంద్ర మంత్రులు సమాధానమిచ్చారు. అనంతరం విపక్షాల ఆందోళనల కొనసాగింపుతో సభను మంగళవారానికి వాయిదా వేశారు.

12 మందిపై వేటు..

12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్​ వేటు వేశారు ఛైర్మన్​. సభలో క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తించారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్​ నుంచి ఫులో దేవి నేతమ్​, ఛయా వర్మ, ఆర్​ బోరా, రాజమణి పటేల్​, సైయద్​ నాసిర్​ హుస్సేన్​, అఖిలేశ్​ ప్రసాద్​ సింగ్​, సీపీఎం నేత ఎలమరమ్​ కరీమ్​, సీపీఐ నేత బినోయ్​ విస్వమ్​, టీఎంసీ నేతలు దోలా సెన్​, శాంట ఛెత్రి, శివసేనా నుంచి ప్రియాంక ఛతుర్వేది, అనిల్​ దేశాయ్​లపై వేటు పడింది. వీరంతా మిగిలిన సభా కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

14:09 November 29

సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం

నూతన సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటు ద్వారా బిల్లును ఆమోదించారు. ఆ తర్వాత 30 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.

14:04 November 29

రాజ్యసభ ముందుకు సాగు చట్టాల రద్దు బిల్లు

నూతన సాగు చట్టాల రద్దు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. బిల్లుపై చర్చ జరుగుతోంది.

లోక్​సభ మంగళవారానికి వాయిదా

రైతుల సమస్యలు సహా ఇతర అంశాలపై చర్చ చేపట్టాలన్న విపక్ష సభ్యుల ఆందోళనలో లోక్​సభ దద్దరిల్లింది. శాంతియుతంగా ఉండాలని స్పీకర్​ చెప్పినా.. ఆందోళనలు కొనసాగించటం వల్ల సభను మంగళవారం (నవంబర్​ 30) ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

13:46 November 29

'సాగు చట్టాల రద్దు బిల్లుపై చర్చకు ఎందుకు వెనకాడుతున్నారు'

సాగు చట్టాల రద్దు బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే లోక్​సభలో ఆమోదం తెలపటాన్ని తప్పుపట్టంది కాంగ్రెస్​. పార్లమెంటరీ నియమాలను గాలికి వదిలేశారని ఆరోపించింది. ప్రతిపక్షాలు మద్దతు తెలిపుతున్నా.. బిల్లుపై చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు లోక్​సభలో కాంగ్రెస్​ పక్ష నేత అధిర్​ రంజన్​ చౌదరి. బిల్లుపై చర్చించేందుకు సమస్య ఏమిటి? గతంలో చట్టాలు రద్దు చేసినప్పుడు చర్చ జరిగింది. ఇప్పుడు సమస్య ఏమిటి? అని ప్రశ్నిచారు. రైతులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్​ చేశారు. కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రాను పదవి నుంచి తొలగించాలన్నారు.

12:40 November 29

రాజ్యసభ 2 గంటలకు వాయిదా

తిరిగి సభ ప్రారంభమవగా.. పలు అంశాలపై చర్చించాలని విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ గందరగోళంగా మారింది. ఈ క్రమంలో ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. విపక్ష సభ్యులు నిరసనలతో హోరెత్తించగా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

12:14 November 29

సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

  • సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
  • లోక్‌సభలో మూడు సాగు చట్టాల రద్దు బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
  • సాగు చట్టాల రద్దు బిల్లు ప్రవేశపెట్టిన వ్యవసాయ మంత్రి తోమర్
  • విపక్షాల ఆందోళన మధ్యే సాగు చట్టాల రద్దు బిల్లు పెట్టిన తోమర్
  • బిల్లుల రద్దుపై చర్చ చేపట్టాలని పట్టుబట్టిన విపక్షాలు
  • విపక్షాల డిమాండ్‌ను తిరస్కరించిన స్పీకర్‌ ఓంబిర్లా
  • మూజువాణి ఓటుతో సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
  • లోక్‌సభను మ.2 గంటల వరకు వాయిదా వేసిన స్పీకర్‌

12:10 November 29

లోక్‌సభకు ముందు కొత్త వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు

  • లోక్‌సభకు ముందు కొత్త వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు
    సాగు చట్టాల రద్దు బిల్లు ప్రవేశపెట్టిన వ్యవసాయ మంత్రి తోమర్
    విపక్షాల ఆందోళన మధ్యే సాగు చట్టాల రద్దు బిల్లు పెట్టిన తోమర్

11:25 November 29

మధ్యాహ్నం 12.20 గంటలకు రాజ్యసభ వాయిదా

విపక్ష ఎంపీల నిరసనలతో రాజ్యసభ వాయిదా పడింది. వివిధ అంశాలపై చర్చ చేపట్టాలని డిమాండ్​ చేస్తూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగిన క్రమంలో సభను మధ్యాహ్నం 12.20 గంటల వరకు వాయిదా వేశారు రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు.

11:17 November 29

విపక్షాల ఆందోళన- లోక్​సభ 12 గంటలకు వాయిదా

లోక్​సభ ప్రారంభంకాగానే వివిధ అంశాలను లేవనెత్తుతూ ఆందోళనకు దిగారు విపక్ష ఎంపీలు. వెల్​లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. విపక్షాల నిరసనలతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్​ ఓం బిర్లా.

11:03 November 29

సాగు చట్టాల రద్దు కోరుతూ కాంగ్రెస్​ ఆందోళన

మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ పార్లమెంట్​ ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద.. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు ఆ పార్టీ నేతలు.

10:47 November 29

Parliament live: పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు లైవ్​ అప్డేట్స్​

parliament winter session 2021: పార్లమెంట్​ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పార్లమెంట్​లో సభామర్యాదను పాటించాలన్నారు.

"ఈ సమావేశాలు చాలా ముఖ్యమైనవి. మంచి ఉద్పాతకతను దేశ ప్రజలు కోరుకుంటున్నారు. బంగారు భవిష్యత్తు కోసం వారి బాధ్యతను వారు నిర్వర్తిస్తున్నారు. కొవిడ్​-19 కొత్త వేరియంట్​పై అప్రమత్తంగా ఉన్నాం. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరిస్తాయనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

" లోక్​సభ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. సభాసమయంలో అన్ని పార్టీలు సహకరిస్తాయని, సభ సజావుగా సాగుతుందనే నమ్మకం ఉంది. క్రమశిక్షణతో సభ్యులు తమ విధులను నిర్వర్తించాలి. అంతా కలిసి సభామర్యాదను పెంచుదాం. "

- ఓం బిర్లా, లోక్​సభ స్పీకర్​.

26 బిల్లులు..

శీతాకాల సమావేశాల్లో 26 బిల్లులను తీసుకొచ్చేందుకు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సభలో అందరి సహకారంతో బిల్లులను గట్టెక్కించాలని భావిస్తోంది. తొలిరోజునే సాగు చట్టాల రద్దు బిల్లును పార్లమెంట్​ ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు.. పలు అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.

నోటీసులు..

చట్ట బద్ధంగా అన్ని పంటలకు కనీస మద్దతు ధర కలిపిస్తామని ప్రభుత్వం ప్రకటించాలనే డిమాండ్​పై చర్చించేందుకు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలని కోరుతూ నోటీసులు ఇచ్చారు లోక్​సభలో కాంగ్రెస్​ పక్షనేత అధిర్​ రంజన్​ చౌదరి. ఇదే అంశంపై ఆమ్​ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్​ సింగ్​ నోటీసులు ఇచ్చారు.

Last Updated : Nov 29, 2021, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.