Parliament Winter Session 2021: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఒక్కరోజు ముందుగానే ముగియనున్నట్లు తెలుస్తోంది. డిసెంబరు 23న ముగియాల్సి ఉండగా.. ఒకరోజు ముందుగానే అంటే డిసెంబరు 22నే (బుధవారం) ముగియనున్నట్లు పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఈ సమావేశాలకు ప్రభుత్వం పెట్టుకున్న అజెండా పూర్తయినందువల్ల సమావేశాలను ముందే ముగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 29న ప్రారంభమయ్యాయి.
ఇదీ చూడండి: ఐఓసీ రిఫైనరీలో మంటలు- ముగ్గురు మృతి, 44 మందికి గాయాలు